ఫోన్ దొంగతనం అంటగట్టారని.. అవమానం భరించలేక ఒంటికి నిప్పంటించుకున్న మహిళ..
ఫోను దొంగతనం అంటగట్టి అవమానించారని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శంషాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.

శంషాబాద్ : ఫోను దొంగలించావని అనుమానించారన్న అవమానభారంతో ఓ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన హైదరాబాదులోని శంషాబాద్ లో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే… మంగమ్మ(40) ఒంటరి మహిళ. మూడేళ్ల క్రితం భర్త మృతి చెందాడు. అప్పటినుంచి ఇళ్లల్లో పనులు,.కాయ కష్టం చేస్తూ బిడ్డల్ని పోషించుకుంటుంది.
అయితే ఆమెను చేయని పొరపాటుకు పంచాయతీ పెట్టి దూషించారు. దీంతో అవమాన భారం భరించలేక ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన శంషాబాద్ బహదూర్ గూడ లో ఈనెల 4వ తేదీ రాత్రి జరిగింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగమ్మ భర్త ఎంగాని నరసింహ కూలీ పని చేసేవాడు. అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందాడు.
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనంలో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి..
దీంతో మంగమ్మ కూడా కూలీ పనులకు వెళుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల నాలుగవ తేదీన అదే గ్రామంలో ఉండే తాపీ మేస్త్రి వెంకటేష్ కడుతున్న ఓ భవనంలోకి పనికి వెళ్ళింది. ఈ క్రమంలో అక్కడ ఓ సెల్ ఫోన్ పోయింది. దీంతో వారు మంగమ్మను అనుమానించారు. సర్పంచ్ సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఆమెను తిట్టారు. అంతేకాదు తెల్లారేసరికి ఫోన్ తిరిగి తెచ్చి ఇవ్వాలని బెదిరించారు.
తాను ఫోన్ తీయలేదని మంగమ్మ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో అవమానం భారం భరించలేకపోయింది. ఆమెకు 14 ఏళ్ల లోపు ఇద్దరు కుమార్తెలున్నారు. వారు నిద్రపోయాక ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటల వేడి,కి ఆమెకేకలకు నిద్రలేచిన కూతుర్లు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చారు. మంటలు ఆర్పి, బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.