హైదరాబాద్ లో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

First Published 11, Jun 2018, 2:11 PM IST
woman software engineer suicide in hyderabad
Highlights

పుణేలో ఉద్యోగం...హైదరాబాద్ లో మరణం 

పుణె లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ యువతి హైదరాబాద్ ఆత్మహత్యకు పాల్పడింది. వర్క్ ఫర్ హోం లో బాగంగా హైదరాబాద్ లో భర్తతో పాటు ఇంటివద్దే ఉంటున్న ఈమె నిన్న మద్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. సిద్దిపట జిల్లా కొమరవెల్లి కి చెందిన శ్రీధర్ కి వరంగల్ కి చెందిన కీర్తనతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. కీర్తన పుణెలోని ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఈమె వర్క్ ఫర్ హోమ్ లో బాగంగా మియాపూర్ లో భర్తతో పాటే నివాసముంటూ ఇంటివద్ద నుండే పని చేస్తోంది. 

నిన్న శ్రీధర్ ఏదో పనిపై పొద్దున బైటికెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగివచ్చాడు. అతడు ఇంట్లికి చేరుకునే సరికి భార్య కీర్తన ప్యాన్ కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో అతడు వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు తెలియచేశాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, లోతుగా విచారణ జరిపుతున్నట్లు పోలీసులు తెలిపారు.  

loader