హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ పరిధి అత్తాపూర్‌లో ఓ మహిళపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. 

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ పరిధి అత్తాపూర్‌లో ఓ మహిళ తనకు తానే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చిన మహిళా పెట్రోల్ పోసుకుంది. అత్తాపూర్‌ రహదారిపై పిల్లరు నెంబర్ 133 వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కాలిపోయిన మహిళ రోడ్డుపై పడిపోయింది. మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. మహిళను అత్తాపూర్‌కు చెందిన శివానిగా గుర్తించారు. ఆమె బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శివానిని ఆస్పత్రికి తరలించారు. 

కలలో దుర్గా మాతా చెప్పిందంటూ శివాని ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు తెలిపారు. శివాని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.