సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పోలీసులమని బెదిరించిన కొందరు వ్యక్తులు మహిళా ప్రయాణికురాలిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు.

వివరాల్లోకి వెళితే.. సూర్యాపేటకు చెందిన మహిళ తన కుమారుడితో కలిసి కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్‌కు బస్సులో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ కూడలి వద్దు ముగ్గురు గుర్తుతెలియని దుండగులు సదరు మహిళ వద్దకు వచ్చారు.

Also Read:అమెరికా నుంచి వచ్చిన యువతిపై భర్త రేప్: వీడియో తీసిన భార్య

ఆమె బ్యాగులో నిషేధిత వస్తువులు ఉన్నాయని అనుమానంగా ఉందని, తనిఖీ చేయాలంటూ కిందకు దింపారు. లగేజీని పరిశీలిస్తూ ఇద్దరు వ్యక్తులు మహిళ కుమారుడిని తమ వద్ద ఉంచుకోగా.. మరో వ్యక్తి ఆమెను మాట్లాడాలంటూ దగ్గరలోని పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

Also Read:ముంబై మహిళపై అత్యాచారం, హత్య: మట్కాస్వామి అరెస్ట్

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించిన దుండగులు, బాధితురాలిని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆమె అతికష్టంపై జహీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.