హైదరాబాద్: భార్య ముందే ఓ వ్యక్తి యువతిపై అత్యాచారం చేశాడు. అతను అత్యాచారం చేస్తుండగా దాన్ని భార్య, మేనల్లుడు వీడియో తీశారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని, క్రమంగా సన్నిహితమై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడిని వీడియోలు తీసి ముగ్గురు కూడా ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు. దాదాపు యాభై లక్షలు ఆమె నుంచి వసూలు చేశారు. 

హైదరాబాదు సమీపంలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు బాచుపల్లిలో పట్టుకున్నారు. హైదరాబాదులోని కోకాపేటకు చెందిన యువతి అమెరికాలో ఉంటోంది. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానకి ిచెందిన సంజీవ రెడ్డి 2018 జులైలో ఆమెకు ఫేస్ బుక్ ఫ్రెండ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇరువురి మధ్య ఫోన్ లు, ఫేస్ బుక్ చాటింగ్ లు జరుగుతున్నాయి.

యువతి 2018 అక్టోబర్ 31వ తేదీన అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. సంజీవ రెడ్డి వెళ్లి ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. ఆమెను చెల్లెలు ఇంటి వద్ద వదిలి పెట్టాడు. రెండు రోజుల తర్వాత సంజీవ రెడ్డి ఫోన్ చేసి కూకట్ పల్లిలోని హోటల్ కు లంచ్ కు ఆహ్వానించాడు. అక్కడ అతని భార్య కావేరి, మేనల్లుడు విశాల్ రెడ్డిలను ఆమెకు పరిచయం చేశాడు. 

యువతి భోజనం చేయడానికి నిరాకరించింది. దాంతో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది సేవించిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను నిజాంపేటలోని తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. 

ఇంట్లో ఆమెపై సంజీవ రెడ్డి అత్యాచారం చేస్తూ భార్యామేనళ్లలతో వీడియో తీయించాడు. ఆ వీడియోను చూపిస్తూ ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటూ వచ్చారు. సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామంటూ 30 తులాల బంగారం, రూ.6 వేల యూఎస్ డాలర్లు లాక్కున్నారు. దాదాపు 50 లక్షల వరకు వాళ్లు లాక్కున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బీదర్ లో ఉన్న సంజీవరెడ్డిని, అతని భార్య కావేరిని, మేనల్లుడు విశాల్ రెడ్డిని పోలీసులు పట్టుకుని శుక్రవారం రిమాండ్ కు తరలించారు.