జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి: వాస్తవం లేదన్న పోలీసులు
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిందనేప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు ప్రకటించారు.
![woman dies After Stampede at gymkhana grounds in Hyderbad woman dies After Stampede at gymkhana grounds in Hyderbad](https://static-gi.asianetnews.com/images/01gdj4ymfgpr3gbw81chgwhce9/gyymkhana-ground-jpg_363x203xt.jpg)
హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మహిళ మృతి చెందిందని ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు ప్రకటించారు.ఈ నెల 25వ తేదీన భారత్, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద టికెట్ల కోసం వచ్చిన మహిళ తొక్కిసలాటలో గాయపడింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోకి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని అడిషనల్ సీపీ చౌహన్ ప్రకటించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా చెప్పారు. .
ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఇండియా, అస్ట్రేలియా టీ 20 క్రికెట్ మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్ ను చూసేందుకు టికెట్ల కోసం ఇవాళ వందలాది మంది జింఖానా గ్రౌండ్స్ వద్దకు క్రికెట్ అభిమానులు వచ్చారు. ఈ మ్యాచ్ ను చూసేందుకు గాను నాలుగైదు రోజులుగా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే టికెట్ల విక్రయంపై హెచ్ సీ ఏ నుండి ఎలాంటి సమాచారం రాలేదు. జింఖానా గ్రౌండ్స్ తో పాటు హెచ్ సీఏ కార్యాలయానికి టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు తిరుగుతున్నారు.
నిన్న జింఖానా గ్రౌండ్స్ వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళన చేశారు. అయితే ఇవాళ నుండి టికెట్లు విక్రయిస్తామని ప్రకటించారు. అయితే ఒక్కసారిగా టికెట్ల కోసం గేటు వైపునకు వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన మహిళ స్పృహ కోల్పోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు స్పష్టం చేశారు. తొక్కిసలాటకు కారణమైన హెచ్ సీఏ పై చర్యలు తీసుకొంటామని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు.
ఆసుపత్రిలో ఈ మహిళ మరణించినట్టగా మరో తెలుగు చానెల్ ఏబీఎన్ కూడా కథనం ప్రసారం చేసింది. అయితే ఈ తొక్కిసలాటలో ఎవరూ మరణించలేదని పోలీసులు ప్రకటించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు స్పష్టం చేశారు. తొక్కిసలాటకు కారణమైన హెచ్ సీఏ పై చర్యలు తీసుకొంటామని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు.