Asianet News TeluguAsianet News Telugu

జింఖానా స్టేడియం వద్ద క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం తొక్కిసలాట: పలువురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం


సికింద్రాబాద్ జింఖానా స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు.
 

 1 injured after stamped out side gymkhana grounds in  Hyderabad
Author
First Published Sep 22, 2022, 11:58 AM IST

హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్, అస్ట్రేలియా క్రికెట్  మ్యాచ్ టికెట్ల కోసం సికింద్రాబాద్ జింఖానా స్టేడియం వద్ద  అభిమానులు ఒక్కసారిగా ఎగబడడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసులకు, క్రికెట్ టికెట్ల కోసం వచ్చిన వారి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. ఇరు వర్గాల  మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఒకానొక దశలో తొక్కిసలాట చోటు చేసుకొంది. 

 

ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఇండియా,అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉంది.. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు గాను టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు నాలుగైదు రోజులుగా  హెచ్ సీఏ, జింఖానా గ్రౌండ్స్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం చేయలేదు,  టికెట్ల కోసం  క్రికెట్ అభిమానులు ఆందోళన చేశారు. దీంతో ఇవాళ నుండి జింఖానా గ్రౌండ్స్ లో  టికెట్ల విక్రయం చేపట్టనున్నట్టుగా హెచ్ సీఏ ప్రకటించింది. 

ఉప్పల్ స్టేడియంలో 55 వేలకు పైగా సీట్లున్నాయి. అయితే ఈ సీట్ల కెపాసిటీ మేరకు హెచ్ సీ ఏ టికెట్లను విక్రయించాల్సి ఉంది. ఇందులో 39 వేల టికెట్లను ఆఫ్ లైన్ లో విక్రయించాలి. మిగిలిన టికెట్లను ఆన్ లైన్ లో అమ్మాలి. ఈ నెల 15వ తేదీ నుండి టికెట్ల విక్రయం చేపట్టనున్నట్టుగా హెచ్ సీ ఏప్రకటించింది.  ఈ నెల 15న ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే టికెట్ల విక్రయం ముగిసింది. దీంతో ఆఫ్ లైన్ లో టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు ప్రయత్నాలను ప్రారంభించారు. అయితే హెచ్ సీ ఏ నుండి ఎలాంటి  స్పందన రాలేదు.  టికెట్ల విక్రయంలో గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై విచారణ జరపాలని హైకోర్టు న్యాయవాది సలీం  హెచ్ ఆర్ సీ లో ఈ నెల 20వ తేదీన ఫిర్యాదు చేశారు.

also ead:ఈ నెల 25న ఉప్పల్ లో క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయం: హెచ్ఆర్‌సీలో న్యాయవాది సలీం ఫిర్యాదు

టికెట్ల విక్రయం విషయమై ఇంత రచ్చ జరుగుతున్నా కూడా హెచ్ సీ ఏ  నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తనున్నాయి.అయితే ఈ మ్యాచ్ టికెట్ల విషయం చోటు చేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. కొద్దిసేపట్లో జింఖానా గ్రౌండ్స్ కు తెలంగాణ స్పోర్ట్స్ మంత్రి శ్రీనివాస్ గౌడ్  వచ్చి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. అయితే మళ్లీ టికెట్లను విక్రయించే పరిస్థితి ఉంటుందనే అనుమానంతో  జింఖానా గ్రౌండ్స్ పరిసరాల్లో చాలా మంది ఉన్నారు. అయితే అక్కడే ఉన్న వారిని పోలీసులు అక్కడి నుండి పంపించి వేస్తున్నారు.

టికెట్ కౌంటర్ల మూసివేత

జింఖానా స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచర్ కౌంటర్లను మూసివేశారు. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇవాళ ఉదయం 10 గంటలకు టికెట్ల విక్రయం జరుపుతామని హెచ్ సీఏ తెలిపింది.  అయితే పదకొండున్నర గంటలు దాటినా కూడ ఒక్క టికెట్ విక్రయించలేదని టికెట్ కోసం జింఖానా గ్రౌండ్స్  వద్దకు వచ్చిన వారు చెబుతున్నారు. వర్షం పడడం,  గంటన్నర దాటినా కూడా ఒక్క టికెట్ విక్రయించకపోవడంతో గేటు వైపు పెద్ద ఎత్తున అభిమానులు దూసుకు వచ్చారు.  దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  టికెట్ కౌంటర్లను మూసివేశారు. సుమారు 30 వేలకు పైగా  జింఖానా గ్రౌండ్స్ చుట్టూ టికెట్ల కోసం వచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios