హైదరాబాద్‌లోని గాజులరామారం బాలాజీ నగర్ ఎన్‌క్లేవ్‌లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన కొడుకు చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని గాజులరామారం బాలాజీ నగర్ ఎన్‌క్లేవ్‌లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన కొడుకు చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్పజ్యోతి(41) అనే గృహిణి గాజులరామారం బాలాజీ నగర్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటుంది. బుధవారం పుష్ప జ్యోగి తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం పుష్ప జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక, జ్యోతి భర్త ప్రైవేట్ ఉద్యోగిగా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే అందులో ఒకరు ఇటీవల సీఏ పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే కొడకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ జ్యోతి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, ఫలితాలు వెలువడిన తర్వాత జ్యోతి డిప్రెషన్‌కు గురై బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారని జీడిమెట్ల పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
