మందుబాబుల వీరంగం.. కేకలు, అరుపులు, అనుచితపదజాలంతో యువతి హల్ చల్..
జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర ఓ woman హల్ చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీరంగం సృష్టించింది. పోలీసులను, ప్రయాణికులను దుర్భాషలాడుతూ గొడవకు దిగింది. యువతితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు
హైదరాబాద్ : new yearకి నగరం సంబరంగా స్వాగతం పలికింది. అయితే మరోవైపు పోలీసులు నగరంలో drunk and drive తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు. 40 బైకులు, ఏడు కార్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. 92 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. చాలా చోట్ల మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర ఓ woman హల్ చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీరంగం సృష్టించింది. పోలీసులను, ప్రయాణికులను దుర్భాషలాడుతూ గొడవకు దిగింది. యువతితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు అర్ధరాత్రి సమయంలో వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాగా, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మందుబాబులను కట్టడి చేయడానికి పోలీసులు నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. కమిషనరేట్ల పరిధిలో మొత్తం 3,146 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ కమిషనరేట్లో 1,258, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,528. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి. ఈ కమిషనరేట్ల పరిధిలో 265 బృందాలతో పోలీసులు తనిఖీలు చేశారు.
తెలంగాణ టూరిజం శాఖ ఎండీపై లైంగిక వేధింపుల కేసు
ఇదిలా ఉండగా, న్యూ ఇయర్ అంటేనే పుల్ జోష్.. కొత్త సంవత్సరానికి కోటి ఆశలతో స్వాగతం పలకడానికి.. అందరూ పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక మందుబాబుల పోత మాములుగా లేదు. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం లిక్కర్ సేల్స్ విషయంలో మరో రికార్డు సృష్టించింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 (బిల్లింగ్ ముగిసే సమయానికి) మధ్య రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో రూ.3,350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ (liquor sales record in Telangana) ప్రకటించింది.
ఈ నెలలో దాదాపు 40 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల కేసుల బీర్లు కొనుగోలు చేశారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. తెలంగాణ చరిత్రలో ఈ స్థాయి లిక్కర్ విక్రయాలు జరగటం ఇదే ప్రథమమని వివరించింది. ఈ నెల చివరి నాలుగు రోజుల్లోనే రూ. 545 కోట్ల మద్యం అమ్ముడైంది. గత ఏడాది డిసెంబర్‌లో రూ. 2,764 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇవాళ ఒక్కరోజే రూ.104 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్టు వివరించింది. ఈ అర్ధరాత్రి 12 గంటలకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. మరోవైపు బార్లు, పబ్బుల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం సరఫరా చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం వీలు కల్పించింది.