ఈ ఘటన జరిగినప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన బాదిత మహిళ నాగార్జున సాగర్‌లోని విజయ్ విహార్ గెస్ట్ హౌస్‌లో జనరల్ హెల్పర్‌గా పనిచేస్తోంది. ఆగస్ట్ 31, 2016న ఉదయం 10 గంటల ప్రాంతంలో బాత్‌రూమ్‌లు శుభ్రం చేసేందుకు రావు ఆమెను తన గదికి పిలిచాడు. ఆమె వచ్చేసరికి అతను ఒంటిమీద ఒట్టి టవల్‌తో నిలబడి ఉన్నాడు. లోపలికి వచ్చిన ఆమెను మంచంపైకి తోసాడు. ఆమె ప్రతిఘటించడంతో ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించాడు. 

హైదరాబాద్ : ఓ మహిళపై sexual assault ఆరోపణల నేపథ్యంలో Telangana Tourism department మేనేజింగ్ డైరెక్టర్‌పై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ ఘటన ఆగస్ట్, 2016లో జరిగింది. ఆ సమయంలో టూరిజం డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళపై ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2016లో నాగార్జున సాగర్‌లో బోటు యూనిట్ల ప్రారంభోత్సవం సందర్భంగా సూట్‌లో ఉంటున్న మహిళపై బి. మనోహర్‌రావు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

దీనిపై FIR నమోదు చేసి దర్యాప్తు చేయాలని నగర పోలీసులను హైకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు అతనిపై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం, నిందితుడు బి. మనోహర్ రావు 2016లో నాగార్జున సాగర్‌లో బోట్ యూనిట్ల ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఓ సూట్‌లో ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటన జరిగినప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన బాదిత మహిళ నాగార్జున సాగర్‌లోని విజయ్ విహార్ గెస్ట్ హౌస్‌లో జనరల్ హెల్పర్‌గా పనిచేస్తోంది. ఆగస్ట్ 31, 2016న ఉదయం 10 గంటల ప్రాంతంలో బాత్‌రూమ్‌లు శుభ్రం చేసేందుకు రావు ఆమెను తన గదికి పిలిచాడు. ఆమె వచ్చేసరికి అతను ఒంటిమీద ఒట్టి టవల్‌తో నిలబడి ఉన్నాడు. లోపలికి వచ్చిన ఆమెను మంచంపైకి తోసాడు. ఆమె ప్రతిఘటించడంతో ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించాడు. 

ఆమె ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని బయటపడింది. ఈ విషయాన్ని తన సహోద్యోగితో పంచుకుంది. అయితే అతను చాలా influential person అని జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పాడు. అలా జూలై 2017లో, బాధితురాలు తన సహోద్యోగులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. ఆ సమయంలో ఓ న్యాయవాదిని కలిసింది. అతను బాదితురాలు పనిచేసే డిపార్ట్ మెంట్ మేనేజ్‌మెంట్ హెడ్ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్టుకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. 

ఒంటరిగా ఉన్న పదమూడేళ్ల బాలికపై అత్యాచారం..

ఈ మేరకు ఆమె సెప్టెంబరులో క్రిస్టినా జెడ్ చోంగ్టును సంప్రదించినప్పుడు, విని ఊరుకున్నారు. కానీ ఏవిధమైన చర్యలూ తీసుకోలేదు. పోలీసులకు తెలుపలేదు. శాఖాపరమైన విచారణకూ ఆదేశించలేదు. ఈ కేసు ముందుకే సాగలేదు. అంతేకాదు అదే సంవత్సరం డిసెంబరులో, బాధితురాలి కాంట్రాక్ట్ గడువు ముగిసిందని చెప్పారు”అని FIRలో నమోదయ్యింది.

ఆ తరువాత సదరు బాధితురాలు జూలై 2018లో నారాయణగూడ పోలీసులకు ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది, ఆ తర్వాత 2021 అక్టోబర్‌లో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది, ఆ తర్వాత కోర్టు తాజా పిటిషన్‌ను దాఖలు చేయడానికి ఆమెకు స్వేచ్ఛనిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. విచారణకు పోలీసులను ఆదేశించింది. 

IPC సెక్షన్లు 354, 354-(A), SC/ST చట్టంలోని సెక్షన్లు 3(w)(i), 3(2)(V)(a) కింద కేసు బుక్ చేయబడింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని నారాయణగూడ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు తెలిపారు.