నాగర్ కర్నూలు: ప్రియుడిపై మోజులో ఓ మహిళ తన భర్తను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఈ కేసులో పోలీసులు ఆమెను, ఆమె ప్రియుడిని అరెస్ట ుచేసారు. ఈ సంఘటన బుధవారం నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. 

తాడూరు మండలంలోని పర్వతాయిపల్లి గ్రామానికి చెందిన భాగ్యమ్మ కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన యోగితో వివాహేతర సంబంధం నెరపుతోంది. ఈ విషయంలో భర్త దాసరి యాదయ్య (25)కు ఆమెకు తరుచుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. 

దాంతో భర్తను అడ్డు తొలగించుకునేందుకు భాగ్యమ్మ ప్రియుడితో యోగితో కలిసి కుట్ర చేసింది. గత నెల 28వ తేదీన చెర్లటిక్యాల, తుమ్మలసూగూరు గ్రామాల మధ్య కెఎల్ఐ కాలువ వద్ద మద్యం మత్తులో ఉన్న యాదయ్య మెడకు తాడు బిగించి హత్య చేశారు. 

Also Read: ప్రియుడి మోజులో భర్తను చంపిన స్వాతిరెడ్డికి జ్యుడిషియల్ కస్టడీ

ఆ తర్వాత శవాన్ని కాలువలో పడేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని భాగ్యమ్మను, యోగిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు.

స్వాతి అనే మహిళ తన భర్తను చంపి ఆమె స్థానంలో తన ప్రియుడిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కిన ఘటన నాగర్ కర్నూలులో జరిగింది. ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి భర్త స్థానంలో నిలబెట్టాలని చూసిన స్వాతి చివరకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.

Also Read: ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూల్ స్వాతి: ఏ దిక్కూ లేక చివరికిలా...