మహబూబ్ నగర్: ప్రియుడి మోజులో భర్త సుధాకర్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి డ్రామా ఆడిన స్వాతి రెడ్డికి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. స్వాతిరెడ్డిని పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆమెను పోలీసులు మహబూబ్ నగర్ జైలుకు తరలించారు 

నాగర్ కర్నూల్ లో 2017 నవంబర్ లో భర్త సుధాకర్ రెడ్డిని స్వాతి రెడ్డి ప్రియుడి రాజేష్ తో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. క్రషర్ వ్యాపారంలో బిజీగా ఉండి తనను పట్టించుకోవడం లేదనే ఆసంతృప్తితో స్వాతి రాజేష్ కు దగ్గరైంది. భర్తను హత్య చేసి ఆ స్థానంలోకి రాజేశ్ ను తీసుకుని రావాలని ఆమె పథకం వేసింది. 

Also Read: ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూల్ స్వాతి: ఏ దిక్కూ లేక చివరికిలా..

సుధాకర్ రెడ్డిని మట్టుపెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అతని స్థానంలో తాను రావాలని రాజేశ్ ప్లాన్ వేశాడు. రాజేష్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించడానికి కూడా స్వాతి రెడ్డి పూనుకుంది. ప్లాస్టిక్ సర్జరీ కోసం రాజేశ్ తన ముఖాన్ని గ్యాస్ స్టవ్ పెట్టి కాల్చుకోవడమే కాకుండా పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడు. దాంతో రాజేశ్ ఆస్పత్రి పాలయ్యాడు. 

తొలుత స్వాతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు చికిత్స పూర్తయిన తర్వాత రాజేశ్ ను కూడా అరెస్టు చేశారు. బెయిల్ మంజూరైనా ఎవరూ రాకపోవడంతో ఆమె స్టేట్ హోంలోనే ఉంటోంది. నాన్ బెయిలబుల్ వారంట్ తో ఆమెను పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు.

Also Read: ప్రియుడి కోసం భర్తను చంపిన స్వాతి: ఇంకా జైలులోనే రాజేష్