ప్రియుడి కోసం భర్తను చంపి, భర్త స్థానంలో ప్రియుడిని తీసుకురావాలని ప్రతయత్నించి కటకటాలపాలైన నాగర్ కర్నూల్ కు చెందన స్వాతి అనే వివాహిత వ్యవహారం గురించే అందరికీ తెలిసిందే. అయితే భర్తను చంపిన కేసులో జైళ్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఎనిమిది నెలల తర్వాత బైయిల్ వచ్చినా బైటికి రాలూని పరిస్థితి ఏర్పడింది.
ప్రియుడి కోసం భర్తను చంపి, భర్త స్థానంలో ప్రియుడిని తీసుకురావాలని ప్రతయత్నించి కటకటాలపాలైన నాగర్ కర్నూల్ కు చెందిన స్వాతి అనే వివాహిత వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. అయితే భర్తను చంపిన కేసులో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు ఎనిమిది నెలల తర్వాత బైయిల్ వచ్చింది. బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
గతేడాది నవంబర్ నెలలో వ్యాపారి సుధాకర్ రెడ్డిని ప్రియుడి మోజులో భార్య స్వాతి హతమార్చింది. అంతే కాకుండా ప్రియుడు రాజేష్ ముఖంపై యాసిడ్ పోసి ప్లాస్టిక్ సర్జరీ చేయించి తన భర్త స్థానంలోకి తీసుకురావాలనుకుంది. ఇలా అందరినీ అతనే భర్త సుధాకర్ రెడ్డిలా నమ్మించి జీవించాలనుకుంది. అయితే ఆమె ప్లాన్ బెడిసికొట్టి హత్య విషయం బయటపడి కటకటాలపాలు కావాల్సి వచ్చింది.
అప్పటినుండి జైల్లో మగ్గుతున్న ఆమెకు కోర్టు ఈ నెల 16న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమెకు జమానత్ ఇవ్వడానికి కుటుంబ సభ్యులు గానీ బంధువులు గానీ ముందుకు రాలేదు. దీంతో స్వాతికి బెయిల్ వచ్చినా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎలాగోలా జమానత్ లభించి ఈనెల 24న బెయిల్ ఆర్డర్ వచ్చి స్వాతి విడుదలకు అడ్డంకులు లేకుండాపోయాయి. అయితే ఆమె ఆశ్రయం, సంరక్షణ విషయంలో పోలీసులకు మరో సమస్య వచ్చిపడింది. ఆమెకు ఆశ్రయం కల్పించడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం ఒక సమస్య అయితే ఇప్పటికే స్వాతిపై ప్రజల్లో తీవ్ర కోపం మరో సమస్య. దీంతో ఆమెకు ఆశ్రయం, సంరక్షణ విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. .
స్వాతిని తీసుకెళ్లడానికి గానీ అసలు ఆమెను కలవడానికి గానీ తల్లిదండ్రులు ఇష్ట పడటం లేదు. చివరకు ఆమెను స్టేట్ హోమ్ కు తరలించారు
స్వాతికి సంబంధించిన మరిన్ని వార్తల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
https://telugu.asianetnews.com/news/how-mutton-soup-helped-unravel-swathi-murder-case
https://telugu.asianetnews.com/news/woman-and-her-paramour-arrested-for-killing-husband
https://telugu.asianetnews.com/video/police-allegedly-harassing-rajesh-mother-for-hospital-bills
