హైదరాబాద్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ ఘటన హైద్రాబాద్ ఘట్ కేసర్ లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్ ఘట్‌కేసర్ మండలం ఎన్ఎఫ్‌సీనగర్ కు చెందిన దర్జీ గంగాపురం అంజయ్య, భవాని దంపతులు నివసిస్తున్నారు. అంజయ్య వయస్సు 57 ఏళ్లు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు మహారాష్ట్రలో ఉంటున్నాడు. చిన్న కొడుకు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. కొడుకులిద్దరూ కూడ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.

అంజయ్య మద్యానికి అలవాటు పడ్డాడు. ప్రతి రోజూ మద్యం తాగొచ్చి భార్య, చిన్న కొడుకును వేధింపులకు గురి చేసేవాడు. తన భర్తకు మద్యం మాన్పించేందుకు భవాని అన్నోజిగూడకు చెందిన ఆయుర్వేద వైద్యులు గోపి సతీష్ కుమార్ ను ఆశ్రయించింది.

ఆయుర్వేద డాక్టర్ తో పరిచయం భవానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది.  ఈ ఏడాది సెప్టెంబర్ 29వ  తేదీన మద్యం తాగొచ్చిన అంజయ్య భార్య భవానిని కొట్టాడు.  ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు సతీష్ కుమార్ కు ఫోన్ లో చెప్పింది.

ఈ బాధలు భరించని ఆమె తన భర్తను చంపాలని ఆయుర్వేద వైద్యుడు సతీష్ ను కోరింది. దీంతో ఆమెకు ఆయన నిద్రమాత్రలు ఇచ్చాడు. సెప్టెంబర్ 30వ తేదీన భర్తకు నిద్రమాత్రలను ఆమె ఇచ్చింది.

also read:మరో వ్యక్తితో భార్య రాసలీలలు: పోలీసులకు పట్టించిన భర్త

ఈ నెల 1వ తేదీన ఉదయం వైద్యుడు సతీష్ తో కలిసి  అంజయ్యకు ఊపిరాడకుండా చేసి చంపే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయాన్ని గమనించిన అంజయ్య  పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే అతని తలపై రోకలిబండతో కొట్టడంతో ఆయన మరణించాడు. 

రోడ్డు ప్రమాదంలో అంజయ్య మరణించాడని చిన్న కొడుకును స్థానికులను ఆమె నమ్మించింది. 

అయితే స్థానికులకు ఈ విషయమై అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు.పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తెలిసింది. దీంతో గురువారం నాడు సతీష్ కుమార్, భవానిని పోలీసులు అరెస్ట్ చేశారు.