హైదరాబాద్: మరో వ్యక్తితో భార్య కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఓ భర్త పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన హైద్రాబాద్ రామాంతాపూర్ లో చోటు చేసుకొంది. 

గాంధీ ఆసుపత్రిలో  పనిచేసే వివాహితకు ఆమె భర్తకు మధ్య కొంత కాలంగా గొడవలు సాగుతున్నాయి. దీంతో భర్తపై వివాహిత 498 ఏ సెక్షన్ కింద కేసు పెట్టింది.దీంతో భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై తాను ప్రశ్నించినందుకే  తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన ఆరోపిస్తున్నాడు.

తన భార్య మరో వ్యక్తితో అపార్ట్ మెంట్ లో ఉన్న సమయంలో  పోలీసులతో వచ్చిన ఆ వ్యక్తి  తన భార్యను ఆమెతో ఉన్న వ్యక్తిని పోలీసులకు అప్పగించాడు,. 

తన భార్యతో ఉన్న వ్యక్తిపై ఆయన దాడికి యత్నించాడు. పోలీసులు కలుగజేసుకొన్నారు,. వివాహితను ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.