నిజామాబాద్: నిజామాబాద్ పట్టణంలో నారాయణ అనే వ్యక్తి హత్యకు గల కారణాలను పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధం కారణంగానే భార్యే భర్తను హత్య చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు.

భర్తను హత్య చేయించిన భార్య... తెలివిగా తన భర్త కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులు  షాకింగ్ విషయాలను తెలుసుకొన్నారు.

also read:భర్త చనిపోయిన మహిళపై లైంగిక వేధింపులు: కాపాడిన శునకం

నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పైపుల ప్యాక్టరీలో మార్కెటింగ్ ఆఫీసర్ గా నారాయణ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. నారాయణ అదృశ్యమైనట్టుగా గత నెల చివరి వారంలో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గత నెల 27వ తేదీన నారాయణ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగు చేశాయి.

also read:అల్లుడితో అత్త వివాహేతర సంబంధం: కూతురు ఆత్మహత్య, అల్లుడిని చంపేసింది

నారాయణను హత్య చేయించిన తర్వాత ప్లాస్టిక్ కవర్లో చుట్టి బైకుపై డెడ్ బాడీని తరలించే దృశ్యాలను  పోలీసులు  సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. నారాయణ మృతదేహంపై కత్తిపోట్లను గుర్తించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ఈ విషయాలు వెలుగు చూశాయి.

మోపాల్ అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులను కూడ పోలీసులు విచారిస్తున్నారు.