హైదరాబాద్: తనతో వివాహేతర సంబంధం కొనసాగించిన అల్లుడిని అత్త దారుణంగా హత్య చేసింది.ఈ ఘటన హైద్రాబాద్ రామాంతపూర్ లో  చోటు చేసుకొంది.నగరంలోని రామాంతపూర్ లోని కేసీఆర్ నగర్  కు చెందిన అనితకు కూతురు ఉంది. అనిత తన కూతురిని నవీన్ కు ఇచ్చి పెళ్లి చేసింది.

నవీన్ తో అనితకు  వివాహతేర సంబంధం ఉంది. కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడ ఆమె అల్లుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం తెలిసిన అనిత కూతురు  నాలుగు నెలల క్రితం ఉరివేసి ఆత్మహత్య చేసుకొంది.

కూతురు ఆత్మహత్య చేసుకొన్న తర్వాత కూడ అల్లుడితో ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.బుధవారం నాడు రాత్రి అల్లుడు నవీన్ ను అనిత కత్తితో పొడిచి చంపింది.  నవీన్ ను అనిత ఎందుకు చంపిందనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అనిత, నవీన్ మధ్య ఏం జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.