తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్

Hyderabad: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మ‌రిన్ని రోజులు ఇదే ప‌రిస్థితులు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. వ‌ర్షాల నేప‌థ్యంలో భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
 

Widespread rains across Telangana. IMD announces red alert RMA

Widespread rains in Telangana: దేశంలోని చాలా ప్రాంతాల్లో వాన‌లు దంచికొడుతున్నాయి. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మ‌రిన్ని రోజులు ఇదే ప‌రిస్థితులు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. వ‌ర్షాల నేప‌థ్యంలో భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వివ‌రాల్లోకెళ్తే.. రాగల 24 గంటల పాటు తెలంగాణ‌లోని కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ సోమవారం రాత్రి నుంచి తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయంతో ముగిసే 24 గంటల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రెండో రోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర రాజధానిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగులో చాలా చోట్ల, హన్మకొండ, కరీంనగర్ లో కొన్ని చోట్ల, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రుతుప‌వ‌నాల ప్రారంభం నుంచి వ‌ర్షాలు కుర‌వ‌క‌పోడంలో లోటు వ‌ర్ష‌పాతం న‌మోదైంది. అయితే, రాష్ట్రానికి ప్ర‌స్తుతం కురుస్తున్న వర్షాలు ఉత్సాహాన్నిచ్చాయి. సాగు ప‌నులు ఊపందుకున్నాయి. కానీ ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు జ‌న‌జీవ‌నం పై ప్ర‌భావం చూపుతోంది. నైరుతి రుతుపవనాలు ఇప్పటివరకు బలహీనంగానే ఉన్నాయనీ, ఈ సీజన్లో మొత్తం వర్షపాతం 25 శాతం లోటుగా ఉందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. మరోవైపు రాగల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఒడిశాలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తుతో దక్షిణం వైపుకు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తన రోజువారీ నివేదికలో తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios