Asianet News TeluguAsianet News Telugu

బంధువుల సూటిపోటి మాటలతో కూతురిపై వేటేద్దామనుకొన్నా: మనోహరాచారి

 కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడంతో బంధువులు సూటి పోటీ మాటలు తనను తీవ్రంగా బాధించాయని మాధవి తండ్రి మనోహరాచారి చెప్పాడు. 

why manoharachary attacked on his daughter madhavi
Author
Hyderabad, First Published Oct 3, 2018, 12:42 PM IST

హైదరాబాద్: కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడంతో బంధువులు సూటి పోటీ మాటలు తనను తీవ్రంగా బాధించాయని మాధవి తండ్రి మనోహరాచారి చెప్పాడు. బంధువుల మాటలతో ఒకవైపు బాధ, కూతురును బతిలాడినా  ఇంటికి రాకపోవడంతోనే  తాను  కోపంతో రగిలిపోయినట్టు  మనోహరాచారి పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు.

సెప్టెంబర్ 9వ తేదీన హైద్రాబాద్ ఎర్రగడ్డ సమీపంలోని  గోకుల్ థియేటర్ వద్ద కూతురు మాధవి, అల్లుడు సందీప్‌పై మనోహరాచారి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన సందీప్  ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ దాడిలో మాధవి తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

కూతురు, అల్లుడిపై  దాడి చేసిన కేసులో మనోహరాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే  ఈ కేసు విచారణ కోసం మనోహరాచారిని కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. అయితే  ఈ కేసులో పలు కీలక విషయాలను మనోహరాచారి వెల్లడించినట్టు సమాచారం.

తన కూతురు సందీప్‌ను పెళ్లి చేసుకొన్న విషయం పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తేనే తెలిసిందని మనోహరాచారి విచారణ సందర్భంగా  చెప్పారు. అయితే తన కూతురు తక్కువ కులంవాడిని పెళ్లి చేసుకొందని తమ బంధువులు సూటిపోటీ మాటలతో తనను  వేధింపులకు గురి చేశాడని  చెప్పారు.

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను ఎలా క్షమిస్తావు, నీ పెంపకం సరిగా లేదని, మనసు చంపుకొని బతకడం తమ ఇంటా.. వంటా లేదని బంధువులు మనోహరాచారిని సూటిపోటి మాటలతో రెచ్చగొట్టడం వల్లే కూతురు, అల్లుడిపై దాడి చేసినట్టు అతడు విచారణలో వెల్లడించినట్టు సమాచారం.

అయితే  తాను తన కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకొందని తనకు బాధ లేదన్నారు.  తన వద్దకు అన్ని కులాల వాళ్లు వస్తారని.. తానే స్వయంగా తాను తయారు చేసిన  బంగారు ఆభరణాలను వాళ్లకు తొడుగుతానని మనోహరాచారి పోలీసుల విచారణలో చెప్పారు. అయితే  కొందరు బంధువులు కులం పేరుతో రెచ్చగొట్టడం వల్ల తాను ఈ పని చేయాల్సి వచ్చిందని  ఆయన పోలీసులకు చెప్పారు.

అయితే తన కూతురు సందీప్ ను పెళ్లి చేసుకొన్న తర్వాత ఎలా ఉందనే  విషయమై ప్రతీరోజూ ఫోన్ చేసి  అడిగేవాడినని చెప్పారు. మంచిగా బతికే చాలనుకొన్నానని మనోహరాచారి చెప్పారు.  అయితే ఈ విషయమై తనను  ప్రతి రోజూ కొందరు పరామర్శల పేరుతో రెచ్చగొట్టడం వల్ల  కోపాన్ని ఆపులేకపోయినట్టు చెప్పారు.

అంతేకాదు కూతురు వద్దకు వెళ్లి ఇంటికి వస్తే పెళ్లి చేస్తానని చెప్పినా ఆమె రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదన్నారు.అంతేకాదు వారం రోజులుగా  తిండి తిప్పలు లేకుండా మద్యం  తాగి ఇదే విషయమై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే కొందరు బంధువులు చేసిన వ్యాఖ్యల కారణంగా కూతురిపై దాడి చేయాలని  భావించినట్టు చెప్పారు.

ఈ క్రమంలోనే  తన కూతురితో పాటు అల్లుడు కూడ వస్తే  అల్లుడిపై దాడి చేశానని... అతడికి కూతురు అడ్డువస్తే ఆమెపై విచక్షణరహితంగా కత్తితో నరికినట్టు మనోహరాచారి  పోలీసులకు వివరించారు.  

సంబంధిత వార్తలు

నా కూతురిని చూడాలని ఉంది.. మనోహరచారి

భార్యకు చివరి కాల్: అదే మనోహరాచారిని పట్టిచ్చింది

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

 

 

Follow Us:
Download App:
  • android
  • ios