యూ ట్యూబర్ చందు ఎవరు? అతని నేపథ్యం ఏంటంటే...
2021లో చందుకి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైద్యురాలైన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె ఇక్కడే హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో శుక్రవారం నాడు వెలుగు చూసినా ఘటన కలకలం రేపింది. యూట్యూబర్ గా చందుపై ఏకంగా రేప్ కేసు నమోదు అయింది. దీంతో నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారంనాడు అరెస్టు చేశారు. యూట్యూబ్లో పక్కింటి కుర్రాడు పేరుతో చేసే వీడియోలతో చందు పాపులర్ అయ్యాడు. ఆ తరువాత ఓటీటీలు, సినిమాల్లోనూ చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు.
పక్కింటి కుర్రాడిగా పాపులర్ అయిన చందు సాయి.. ధగడ్ వెబ్ సిరీస్ లో నటించాడు. అనేక ఛానల్స్ లో స్కిట్స్ చేశాడు. చందు ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ గిరిజన యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతని మీద సెక్షన్ 376(2) కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి, చంచల్ గూడ జైలుకు పంపించారు.
వాతావరణ శాఖ అలర్ట్ : చలిపెరుగుతోంది.. జర భద్రం....
యూట్యూబర్ చందు అసలు పేరు కోలా చంద్రశేఖర్ సాయికిరణ్. వయసు 30 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి స్వగ్రామం. నటన పై ఉన్న ఆసక్తితో యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వేమగిరి నుంచి హైదరాబాదుకు నివాసం మార్చాడు. హైదరాబాదులోని బండ్లగూడ జాగిర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.
2021లో ఆయనకి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైద్యురాలైన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె ఇక్కడే హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆమె 2020లో హైదరాబాదుకు వచ్చింది. 2021 మార్చిలో ఓ డేటింగ్ యాప్లో చంద్రశేఖర్ ఆమెకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వారిద్దరూ వాట్స్అప్, ఇన్ స్టాలో చాటింగ్ చేసుకునేవారు. అలా పరిచయం కాస్త ఇష్టంగా మారింది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరు కలుసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు ప్రామిస్ చేశాడు చందు.
2021 ఏప్రిల్ 25న తన పుట్టినరోజు వేడుకలకు రమ్మంటూ చందు సాయి ఆ యువతిని పుప్పాలగూడలోని తన ఇంటికి పిలిచాడు. అయితే, ఆమె ఆ రోజు అయిష్టంగానే అక్కడికి వెళ్లింది. చందు ఆ రోజు యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకుని, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ ప్రమాణం చేశాడు. ఈ ఘటన తర్వాత వారిద్దరూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు.
సినిమాల్లో అప్పుడప్పుడే అవకాశాలు వస్తుండడంతో.. ఎక్కువ అవకాశాలు వస్తే బాగా ఉంటుందని చెప్పాడు. దానికి డబ్బులు అవసరం పడతాయని చెప్పడంతో ఆమె తన నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నా.. పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఇటీవల పెళ్లి చేసుకుందాం అంటూ చందును అడిగింది. దీంతో చందు నిజస్వరూపం బయటపడింది.
మూడు కోట్ల రూపాయలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ డిమాండ్ చేశాడు. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. చందు తల్లిదండ్రులు కూడా ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు. కులం తక్కువ అని.. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తమ పరువు పోతుందంటూ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో విసిగిపోయిన ఆ యువతీ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. చందు మీద రేప్ కేసు పెట్టింది. చీటింగ్ కేసూ పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏసీబీఎస్ లక్ష్మీనారాయణ, ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. చందు పై పూర్తి ఆధారాలు సేకరించి.. గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చందు బంధువులు పరారీలో ఉన్నట్లుగా తెలిసింది.