Asianet News TeluguAsianet News Telugu

Revanth Reddy గురించి ఎవరికీ తెలియని టాప్ 5 సీక్రెట్స్

రేవంత్ రెడ్డి ఇక జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురు అయినటువంటి గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Who is revanth reddy - Revanth reddy profile - Telangana New Chief minister - Anumula revanth reddy
Author
First Published Dec 3, 2023, 2:38 PM IST

Revanth Reddy: రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన పొలిటికల్ జర్నీపై ASIANET NEWS TELUGU అందించే టాప్ 5 సీక్రెట్స్

Who is revanth reddy - Revanth reddy profile - Telangana New Chief minister - Anumula revanth reddy

1. ఎనిమిది మందిలో ఒకరు

రేవంత్ రెడ్డి (Revanth Reddy) 1969 నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లి దగ్గర ఉన్న గంగూర్ అనే గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రేవంత్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ. ఈ దంపతులకు మొత్తం ఎనిమిది మంది సంతానం. చిన్నప్పటి నుంచే రేవంత్ రెడ్డి అనేక అంశాల్లో దూకుడుగా వ్యవహరించారు.  

Who is revanth reddy - Revanth reddy profile - Telangana New Chief minister - Anumula revanth reddy
2. పెయింటర్ గా కెరీర్ మొదలుపెట్టి 


1990లో కాలేజ్ చదువు పూర్తయిన తర్వాత పెయింటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి. ఆ తరువాత తన అన్న సహాకారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఆయన ఏ రంగంలో అడుగుపెట్టిన సక్సెస్ అయ్యే వారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అంచలెంచలుగా ఎదిగారు.

3. రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ

రేవంత్ రెడ్డి ఇక జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురు అయినటువంటి గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఆయన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులేశారు. 2001 వరకు వ్యాపారం పై మాత్రమే దృష్టి పెట్టినా ఆయన పేదవారిని ఆదుకోవడం. అనాధలకు పెళ్లిళ్లు చేయించడం వంటి అనేక సేవా కార్యక్రమాలను చేశారు. తనకంటూ ప్రత్యేక బలగాన్ని ఏర్పర్చుకున్నారు. రేవంత్ రెడ్డి ఆ తర్వాత రాజకీయాల మీద మనసు పడటంతో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నారు. 

Who is revanth reddy - Revanth reddy profile - Telangana New Chief minister - Anumula revanth reddy
4.టీఆర్ఎస్ నుంచే రాజకీయ జీవితం 

ఈ క్రమంలో 2006లో టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ఆయన పార్టీ అనేక కార్యక్రమాల్లో కీలక భాగస్వామి అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకున్న రేవంత్ కల్వకుర్తి టికెట్ కూడా ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానం కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోవడంతో చేసేంది ఏం లేక మౌనం దాల్చారు. రాజకీయాలు ఇలాంటివన్నీ సహజం.. ఈసారి కాకపోతే.. మరోసారి అవకాశం కచ్చితంగా దక్కుతుందని టిఆర్ఎస్ లోనే కొనసాగారు. గులాబీ బాస్ కేసీఆర్ తో కలిసి అడుగులు వేస్తారు. ఈ సారి జడ్పిటిసి ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ, ఆ టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెందిన రేవంత్ రెడ్డి వెంటనే టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు. జీవితంలో మరోసారి టిఆర్ఎస్ ముఖం చూడకూడదని గట్టి నిర్ణయానికి వచ్చారు.

ఈ తరుణంలో ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి జడ్పిటిసిగా మొట్టమొదటిసారిగా గెలుపొందారు. ఇక 2007లో మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తన సత్తా ఏంటో అందరికి చూపించారు. రేవంత్ రెడ్డి విజయం ఆనాడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనగా మారింది. మొట్టమొదటిసారిగా రేవంత్ పేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగింది. ఈ తరుణంలో తన అభిమాన పార్టీ టీడీపీ మొగ్గు చూపారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను గెలుపొందినటువంటి సర్టిఫికెట్ తీసుకుని వెళ్లి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Who is revanth reddy - Revanth reddy profile - Telangana New Chief minister - Anumula revanth reddy

5.ఓటుకు నోటు కేసులో అరెస్ట్

రేవంత్ రెడ్డి. 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ కావటం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో తన కూతురి పెళ్లి ఉన్న సందర్భంలో కూడా ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి ప్రోత్సాహంతో, ప్రోత్బలంతో వాళ్ళ అండదండలతో జైలు నుంచి స్పెషల్ పర్మిషన్ మీద వచ్చి తన పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. 

ఆ తరువాత జరిగిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.  అధికార గులాబీ పార్టీని టార్గెట్ చేస్తూ.. కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా మారారు. అతి కొద్ది కాలంలోనే కాంగ్రెస్ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. ఈ తరుణంలో జరిగిన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిపై గులాబీ సేన ప్రత్యేక దృష్టి పెట్టింది. కేసీఆర్ సర్వశక్తులను ఒడ్డించి రేవంత్ రెడ్డి ఓడించారు. 

తెలంగాణ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్

 

Follow Us:
Download App:
  • android
  • ios