హైదరాబాద్ నగరంలో అశ్లీల నృత్యాలు..మండిపడుతున్న స్థానికులు

First Published 23, Jul 2018, 2:18 PM IST
western dance at marriage function in hyderabad
Highlights

చాంద్రాయణగుట్ట నూరి ఫంక్షన్ హాలులో జరిగిన పెళ్లిలో నిర్వాహకులు బెల్లీ డ్యాన్స్ చేయించారు. పిర్యాదులు అందడంతో పోలీసులు పెళ్లికొడుకు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్ నగరంలో అశ్లీల నృత్యాలు హాట్ టాపిక్ గా మారాయి. చాంద్రాయణ గుట్టలోని విదేశీ యువతులతో బెల్లీ డ్యాన్స్ చేయించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ పెళ్లి వేడుకలో ఈ నృత్యాలు చేయించినట్లు సమాచారం.

ఈ ఘటనతో నగరంలో  కలకలం రేపింది. చాంద్రాయణగుట్ట నూరి ఫంక్షన్ హాలులో జరిగిన పెళ్లిలో నిర్వాహకులు బెల్లీ డ్యాన్స్ చేయించారు. పిర్యాదులు అందడంతో పోలీసులు పెళ్లికొడుకు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఫంక్షన్ హాలు యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డ్యాన్సర్లు మాత్రం పరారయ్యారు. డీజే సౌండ్, బెల్లీ డ్యాన్స్‌తో నూరీ ఫంక్షన్ హాలు హోరెత్తింది. దీంతో విసిగిపోయిన స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. బెల్లీ డ్యాన్స్ చేసినవారిలో విదేశీ యువతులు ఉన్నారని సమాచారం. చాంద్రాయనగుట్ట ప్రాంతంలో రేవు పార్టీలు అశ్లీల నృత్యాలు ఇబ్బందికరంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కల్చర్‌పై విమర్శలు వస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

loader