Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తాం.. : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Hyderabad: తెలంగాణ‌లో గిరిజనులకు వారి జనాభా సంఖ్య‌ల‌ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య మొదలైన వాటిలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ బీజేపీ హామీ ఇచ్చింది. బీజేపీ అధినాయ‌క‌త్వం చేసిన ప‌లు హామీల‌ను ప్ర‌స్తావిస్తూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు జీ కిష‌న్ రెడ్డి మ‌రోసారి ఈ విష‌యాన్ని గుర్తు చేశారు.
 

We will provide 10% reservation to tribals in Telangana. : Union Minister Kishan Reddy RMA
Author
First Published Oct 12, 2023, 4:51 PM IST

Telangana BJP President G Kishan Reddy:  తెలంగాణ‌లో గిరిజనులకు వారి జనాభా సంఖ్య‌ల‌ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య మొదలైన వాటిలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ బీజేపీ హామీ ఇచ్చింది. బీజేపీ అధినాయ‌క‌త్వం చేసిన ప‌లు హామీల‌ను ప్ర‌స్తావిస్తూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు జీ కిష‌న్ రెడ్డి మ‌రోసారి ఈ విష‌యాన్ని గుర్తు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ కోసం ఇచ్చిన ప‌లు హామీల‌ను సైతం ఆయ‌న ప్ర‌స్తావించారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని జీ కిషన్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారని తెలంగాణ బీజేపీ చీఫ్ తెలిపారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య తదితరాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని  చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గిరిజనులకు మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయనీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతో జిల్లాలో విద్య, ఉపాధి పెరుగుతాయన్నారు.

ములుగులోని సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన త‌ర్వాత కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆలయం వెలుపల బీజేపీ నేత విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజన తల్లులైన స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ దర్శనం కోసమే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఆదివాసీల కోసం మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చోట్ల కీలక అభివృద్ధి చేసిందన్నారు. జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతో విద్య పెరుగుతుందనీ, ఉపాధి పెరుగుతుందని, ఇతర పరిశ్రమలు కూడా పెరుగుతాయని ప్రధాని మోడీ మంత్రివర్గంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కూడా అయిన కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే గిరిజన విశ్వవిద్యాలయం పర్యాటక పరిశ్రమకు, ఉపాధికి ఊతమిస్తుందని, గిరిజన అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని ఆయన అన్నారు.

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకట‌న గురించి మాట్లాడుతూ.. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ ఘన విజయం సాధించేందుకు సిద్ధంగా ఉన్నందున బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండో స్థానం కోసం పోటీ పడతాయని జోస్యం చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను స్వాగతించిన రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ పార్టీ ఐక్యంగా పోరాడి అధికారంలోకి వస్తుందని అన్నారు.  సీఎం కే.చంద్రశేఖర్‌రావు అవినీతి కుటుంబ పాలనను ప్రజలు ఓడించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుకుంటున్నారనీ, అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్న నమ్మకం ఉందన్నారు.

తెలంగాణ ప్రజలు ఇంతకుముందు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల దుష్పరిపాలనను చూశారనీ, డిసెంబర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సకల జనుల తెలంగాణ.. సకల జనుల పాలన వాస్తవమవుతుందని బీజేపీ చీఫ్ అన్నారు. కాగా, ప్రతి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్ద రూ.30 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు ఉంచి చంద్రశేఖర్‌రావు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మార్చారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజలు ఓట్లు వేయకుంటే పథకాలు ఆపేస్తామని నేతలు బెదిరిస్తున్నార‌నీ,  బీఆర్‌ఎస్ నాయకులు ఓటర్ల జాబితాతో అక్రమాలకు పాల్పడుతున్నారని రాజేందర్ విమ‌ర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios