దసరా-దీపావళి బోనస్ కింద సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్లు ఇస్తాం: సీఎం కేసీఆర్
Hyderabad: గత ప్రభుత్వాలు నష్టాల్లోకి నెట్టిన సింగరేణి కాలరీస్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పైకి తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. దసరా-దీపావళి బోనస్ కింద సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పారు. దేశంలో సహజ వనరులు, కష్టపడి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ దుష్పరిపాలన కారణంగా వనరులను వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు.
Telangana CM and BRS President KCR: గత ప్రభుత్వాలు నష్టాల్లోకి నెట్టిన సింగరేణి కాలరీస్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పైకి తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. దసరా-దీపావళి బోనస్ కింద సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పారు. దేశంలో సహజ వనరులు, కష్టపడి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ దుష్పరిపాలన కారణంగా వనరులను వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఆశించిన శిఖరాలను చేరుకోలేకపోయామనీ, దేశంలో సహజ వనరులు, కష్టపడి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ దుష్పరిపాలన కారణంగా వనరులను వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు. వనరులను అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సమానంగా వినియోగించుకున్నప్పుడే మనం సాధించిన స్వాతంత్య్రం అర్థవంతంగా ఉంటుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు తెలంగాణలోని అన్ని రంగాలు నాశనమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను దోచుకున్నారనీ, ఇక్కడి ప్రజలు అసమానతలకు బలైపోయారన్నారు. విస్తృత తెలంగాణ ఉద్యమ ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని అన్నారు. "ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటన్నింటి మధ్య ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కరణకు కృషి చేసింది. తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశాం. అనేక రంగాల్లో తెలంగాణను మొదటి స్థానానికి తీసుకొచ్చాం. తెలంగాణ పద్ధతులు, దేశం అనుసరించే స్థాయికి చేరుకున్నాం. ఒకప్పుడు చుక్క నీటి కోసం ఎదురుచూసే తెలంగాణ ఇప్పుడు 20కి పైగా రిజర్వాయర్లతో నీటితో కళకళలాడుతోందని" తెలిపారు. 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే అన్నపూర్ణగా మారిందనీ, సంక్షేమం, అభివృద్ధిలో మనం స్వర్ణయుగంలో ఉన్నామని చెప్పారు.
దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి యావత్ దేశం అబ్బురపడుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. "తలసరి ఆదాయం, ప్రతి వ్యక్తికి విద్యుత్ వినియోగం, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన వైద్యం, విద్య వంటివి రాష్ట్ర అభివృద్ధిని కొలిచే అంశాలు. వీటన్నింటిలోనూ తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సంపదను పెంచి ప్రజలకు పంచాం. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ" అన్నారు. తెలంగాణలో గత నెలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుందనీ, వరదల్లో ప్రజలను రక్షించేందుకు అధికారులు, పరికరాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతరత్రా వాటిని కేటాయించామని తెలిపారు. సహాయక చర్యల కోసం రూ.500 కోట్లు కేటాయించామని చెప్పారు. వరదల్లో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా ఇచ్చామనీ, నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామన్నారు.
గత ప్రభుత్వాలు నష్టాల్లోకి నెట్టిన సింగరేణి కాలరీస్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పైకి తీసుకువచ్చిందన్నారు. "కంపెనీ టర్నోవర్ ను రూ.12 వేల కోట్ల నుంచి రూ.33,000 వేల కోట్లకు పెంచాం. దసరా-దీపావళి బోనస్ గా సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్లు ఇస్తాం. రూ.67,149 కోట్లతో హైదరాబాద్ నగరాన్ని సింగల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం స్ట్రాటెర్జిక్ రోడ్ డెవలప్ మెంట్ ను అమలు చేస్తోంది. మెట్రో, లింక్ రోడ్లను కూడా విస్తరిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, పరిశ్రమలకు స్వర్గధామంగా తెలంగాణ మారింది. రాష్ట్రంలో పరిశ్రమలకు రూ.2,51,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత తొమ్మిదేళ్లలో పారిశ్రామిక రంగంలో 17,21,000 మందికి ఉపాధి లభించింది. ఐటీ రంగాన్ని కూడా తెలంగాణలో అభివృద్ధి చేశాం' అని సీఎం కేసీఆర్ అన్నారు.