టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును 10 రోజుల్లో కొలిక్కి తెస్తాం: సిట్ ఇంచార్జీ శ్రీనివాస్
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో సాంకేతిక ఆధారాలతో విచారణ సాగిస్తున్నామని సిట్ ఇంచార్జీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.
హైదరాబాద్: 10 రోజుల్లో టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును కొలిక్కి తీసుకువస్తామని సిట్ ఇంచార్జీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.
బుధవారం నాడు ఓతెలుగు న్యూస్ చానెల్ కు సిట్ ఇంచార్జీ శ్రీనివాస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీక్ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కేసులో ఎఫ్ఎస్‌ఎల్ రిపోర్టు కీలకం కానుందని సిట్ ఇంచార్జీ శ్రీనివాస్ చెప్పారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఎవరి పాత్ర ఏమిటనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రవీణ్ కు, రేణుకకు మధ్య పరిచయం ఉందన్నారు.ఈ పరిచయం ఆధారంగా ప్రవీణ్ ను రేణుక ప్రశ్నాపత్రం గురించి అడిగిందన్నారుు.ఈ వ్యవహరంలో కూడా డబ్బులు చేతులు మారాయని సిట్ ఇంచార్జీ శ్రీనివాస్ తెలిపారు.
ప్రవీణ్ కు మహిళలతో శారీరక సంబంధాల అంశం విషయమై ఇంకా విచారణ చేయలేదన్నారు. ప్రవీణ్ వ్యక్తిగత అంశాలపై ప్రశ్నపత్రం లీక్ కు కారణమయ్యాయా అనే విసయమై దర్యాప్తు సాగిస్తామన్నారు. శంకర్ లక్ష్మి వద్ద ఉన్న పాస్ వర్డ్ ను దొంగిలించి ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టుగా గుర్తించామన్నారు. ఈ కేసును నీతి, నిజాయితీగా విచారణ చేస్తామని శ్రీనివాస్ తెలిపారు..ఈ కేసులో ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని ఏఆర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కేసులో ఒక ఏసీపీ, ఒక డీసీపీ, ఇద్దరు ఇన్స్‌పెక్టర్లతో దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు.
టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో సిట్ అధికారి
టీఎస్‌పీఎస్‌సీ ఉన్నతాధికారులతో సిట్ ఇంచార్జీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారంనాడు సమావేశమయ్యారు. కార్యాలయంలో పలు రూమ్ లను ఆయన పరిశీలించారు. కాన్షిడెన్షియల్ రూమ్ లో కంప్యూటర్లను ఆయన పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, సీక్రెసీతో పాటు ప్రింటింగ్ వ్యవహరాలపై సిట్ చీఫ్ ఆరా తీశారు. కాన్ఫిడెన్షియల్ రూం నుండి పేపర్ బయటకు వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇంచార్జి శంకర్ లక్ష్మిని పోలీసులు ప్రశ్నించారు. శంకర్ లక్ష్మి వద్ద పాస్ వర్డ్ ను చోరీ చేసిన ప్రవీణ్ ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టుగా గుర్తించారు.