Asianet News TeluguAsianet News Telugu

పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి ప్రవీణ్ రాసలీలలు, ఏకంగా 46 మంది అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.  అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియోలు మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. ఏకంగా 46 మంది అమ్మాయిలతో అతను నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. 

new twist in tspsc paper leak case
Author
First Published Mar 15, 2023, 3:38 PM IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ప్రవీణ్ విషయంలో రోజుకొక కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియోలు మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 46 మంది మహిళలతో న్యూడ్‌కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. వీళ్లకి కూడా పేపర్ లీక్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్‌తో పాటు పాలుపంచుకున్న రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్ధారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా వ్యవహరిస్తున్నారు రేణుక. ఏడాది 12 సెలవులు పెట్టింది రేణుక. ఈ నెల 4 , 5 తేదీల్లో తమ బంధువు మృతిచెందాడని సెలవు పెట్టింది. ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు సెలవులు పెడుతోంది రేణుక. 

ALso REad: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. రంగంలోకి సిట్, ఎవరిని వదిలేది లేదన్న ఏఆర్ శ్రీనివాస్

మరోవైపు..పేపర్ లీక్‌కు సూత్రధారిగా రాజశేఖర్‌ను తేల్చారు పోలీసులు. ప్రవీణ్ ద్వారా పేపర్‌ను బయటికి తెప్పించాడు రాజశేఖర్. టీఎస్‌పీఎస్సీలో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా రాజశేఖర్‌ వ్యవహరిస్తున్నాడు. టెక్నికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు రాజశేఖర్. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్‌ను బయటకు తెచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. సిస్టం పాస్వర్డ్ ఐడీ ఇచ్చినందుకు భారీగా డబ్బులు ముట్టజెప్పాడు ప్రవీణ్. 

మరోవైపు.. పేపర్ లీకేజ్ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏఈ పరీక్షపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని.. ఈ పరీక్షపై ఇంకా నివేదిక రావాల్సి వుందని ఛైర్మన్ వెల్లడించారు. దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్‌మీట్ పెడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చాక దాదాపు 35 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు జనార్థన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. టీఎస్‌పీఎస్సీ అనేక కొత్త విధానాలు తెచ్చిందని.. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మల్టిపుల్ జంబ్లింగ్ చేశామని ఛైర్మన్ తెలిపారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ అక్రమాలు జరగొద్దనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జనార్థన్ రెడ్డి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios