ముందస్తు ఎన్నికలపై చర్చలు జరుగుతున్నాయని టీఆర్ఎష్ ఎంపీ వినోద్ చెప్పారు. ముందస్తు ఎన్నికల నిర్ణయమనేది రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయమని వినోద్ తెలిపారు

న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికలపై చర్చలు జరుగుతున్నాయని టీఆర్ఎష్ ఎంపీ వినోద్ చెప్పారు. ముందస్తు ఎన్నికల నిర్ణయమనేది రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయమని వినోద్ తెలిపారు. అయితే ఇంకా అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఆదివారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీతో సమావేశం ముగిసిన తర్వాత భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్ర అసెంబ్లీ రద్దు విషయమనేది మంత్రి వర్గం తీసుకొంటుందన్నారు. మంత్రివర్గంలో తాము భాగస్వామ్యులు కాదన్నారు.ముందస్తుపై చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. అయితే ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే ఆరు మాసాల్లోపుగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును ఎంపీ వినోద్ గుర్తు చేశారు.

ముందస్తు ఎన్నికల విషయమై మేం ముహుర్తాలు పెట్టుకోలేదన్నారు.ఎప్పుడు ఎన్నికలకు వెళ్లాలనే దానిపై మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఒక వేళ అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర మంత్రివర్గమేనని ఆయన చెప్పారు.ముందస్తు ఎన్నికలపై మీడియాలో వస్తున్న తేదీలను ఆయన కొట్టిపారేశారు. ఇంకా తేదీలు ఖరారు కాలేదన్నారు.

ఈ వార్తలు చదవండి

ముందస్తు ఎన్నికలు... మా పార్టీ వ్యూహం: తేల్చేసిన నాయిని

ముందస్తు సంకేతాలు: కేంద్ర మంత్రులతో కేసీఆర్ వరుస భేటీలు