Asianet News TeluguAsianet News Telugu

ముందస్తు సంకేతాలు: కేంద్ర మంత్రులతో కేసీఆర్ వరుస భేటీలు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ఆదివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో కేసీఆర్ సమావేశమయ్యారు

Telangana cm KCR meets union home minister Rajnath singh
Author
New Delhi, First Published Aug 26, 2018, 5:17 PM IST

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ఆదివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై కేసీఆర్ కేంద్ర మంత్రులతో చర్చించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీకి వెళ్లారు. శనివారం నాడు ప్రధానమంత్రితో కేసీఆర్ సమావేశమయ్యారు, తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మార్చుకొన్న జోనల్ వ్యవస్థకు సంబందించిన కేసీఆర్ ప్రధానితో చర్చించారు. ఈ మేరకు కొత్త జోనల్ వ్యవస్థకు ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని సమాచారం.ఈ మేరకు ఈ ఫైల్ పై మోడీ సంతకం పెట్టారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఆదివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన అంశాలపై చర్చించారు. హైకోర్టు విభజనతో పాటు 9వ షెడ్యూల్ లోని అంశాలపై కేసీఆర్ చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న నీటి వివాదాల విషయాన్ని కూడ కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.

రాజ్‌నాథ్ తో సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కూడ కేసీఆర్ సమావేశమయ్యారు. ఎప్ఆర్‌బీఎం పెంపు విషయమై చర్చించారని సమాచారం. తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉన్నందున ఎప్ఆర్‌బీఎం పెంపు విషయానికి ఇబ్బంది లేదనే విషయాన్ని కేసీఆర్ జైట్లీకి వివరించినట్టు చెప్పారు.

ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతున్న తరుణంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని కూడ కేసీఆర్ కేంద్ర మంత్రులను కోరడం వెనుక ముందస్తు ఎన్నికలు వ్యూహం కూడ మరో కారణమని ప్రచారం సాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios