Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ప్రైవేట్ ఆసుపత్రిలో 43 యేళ్ల మహిళపై.. 23 యేళ్ల వార్డ్ బాయ్ అత్యాచారం..

ఓ మహిళపై ఆస్పత్రిలో అత్యాచారానికి పాల్పడ్డాడు వార్డ్ బాయ్. వయసులో తనకంటే 20యేళ్లు పెద్ద అయిన హౌస్ కీపింగ్ ఉమెన్ మీద జరిగిన ఈ అత్యాచారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. 

ward boy molested house keeping woman in a private hospital, hyderabad
Author
First Published Sep 24, 2022, 9:43 AM IST

హైదరాబాద్ : ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో హౌస్ కీపింగ్ పనులు చేసే మహిళపై వార్డ్ బాయ్ అత్యాచారం చేసిన ఘటన మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కసప రాజు శ్రీనివాస్ కథనం ప్రకారం.. అంబర్ పేట, అలీ కేఫ్ ప్రాంతానికి చెందిన మహిళ (43) దిల్ సుఖ్ నగర్ నిఖిల్ ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ గా రెండేళ్లుగా పనిచేస్తోంది. ఆమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈనెల 21న బుధవారం 8:30కి క్యాషియర్ ఫోన్ చేసి నైట్ డ్యూటీ ఉందని చెప్పడంతో రాత్రి 9 గంటలకు ఆమె  విధులకు హాజరు అయింది.

జగిత్యాలకు చెందిన మారుతి సందీప్(26)  పురానాపూల్ లో నివాసం ఉంటూ నిఖిల్ ఆస్పత్రిలో రాత్రిపూట వార్డ్ బాయ్ గా పని చేస్తున్నాడు. 21న రాత్రి నైట్ డ్యూటీకి హాజరైన అతను రెండో అంతస్థులోని గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన మహిళ వెనకే వెళ్ళి తలుపు వేసాడు. ఆమె తప్పించుకునేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా జుట్టు పట్టుకుని లాగి అత్యాచారం చేశాడు.  జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.  దీంతో భయపడ్డ బాధితురాలు  ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని శుక్రవారం మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసులు ఫోన్ చెప్పేవరకు ఈ విషయం తమ దృష్టికి రాలేదని ఆస్పత్రి మేనేజర్ శ్రవణ్ తెలిపారు.

విషాదం.. మలక్ పేట హిట్ అండ్ రన్ కేసు.. డాక్టర్ శ్రావణి కన్నుమూత..

ఇదిలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణమై ఘటన వెలుగు చూసింది. విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లే.. వారి పాలిట కాలయములుగా మారుతున్నారు. పలురకాలుగా వారిని బెదిరిస్తూ, వేధిస్తూ అనాగరికంగా, అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని దమ్మపేట మండలంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో ఒక విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అఘాయిత్యం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వరావుపేట నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన బాలిక ఆ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. 

ఆ బాలిక పై కన్నేసిన ఉపాధ్యాయుడు పిచ్చయ్య ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. దీనికోసం పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, తన మాట వినకపోతే చంపుతానని బాలికను బెదిరించాడు. అలా పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. ఇటీవల విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ వారు ఆమెకు వైద్యపరీక్షలు చేయించారు.   

బాలికను పరీక్షించిన వైద్యులు  ఆమె గర్భం దాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు.. విద్యార్థినిని నిలదీయడంతో బాలికల పాఠశాలలో జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. దీంతో విద్యార్థిని తల్లి దమ్మపేట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  ఉపాధ్యాయుడు పిచ్చయ్యపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios