వరంగల్  కేఎంసీ  మెడికో   ప్రీతి ఆత్మహత్యాయత్నం  ఘటనపై  పోలీసులు   సీనియర్  సైఫ్ ను  ప్రశ్నిస్తున్నారు.  

వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో సీనియర్ సైఫ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.కేఎంసీ మెడికల్ కాలేజీలో మెడికో ప్రీతి బుధవారం నాడు ఆత్మహత్యాయత్నం చేసుకుంది, ఈ కాలేజీలో పనిచేస్తున్న సీనియర్ విద్యార్ధి సైఫ్ పై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా తమ కూతురు ప్రీతిపై సైఫ్ వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సైఫ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సైఫ్ ను పోలీసులు ఈ విషయమై ప్రశ్నిస్తున్నారని సమాచారం. 

మెడికో ప్రీతిని విధుల విషయమై మాత్రమే మందలించినట్టుగా సైఫ్ చెబుతున్నట్టుగా సమాచారం. అయితే మెడికో ప్రీతిపై వేధింపులకు పాల్పడలేదని సైఫ్ చెబుతున్నట్టుగా తెలుస్తుంది. 

also read:కోమాలోకి ప్రీతి.. సీనియర్ల వల్లే ఇలా, గోప్యంగా మేనేజ్‌మెంట్‌ : వరంగల్‌లో మెడికో సోదరుడి ఆరోపణలు

కేఎంసీలో ఎలాంటి ర్యాగింగ్ ఘటనలు లేవని కూడా జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. సైఫ్ వేధింపులకు గురి చేస్తున్నారని మెడికో ప్రీతి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై వీరిద్దరికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. చాలా కాలంగా సైఫ్ తమ కూతురిని వేధిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉందని హైద్రాబాద్ నిమ్స్ వైద్యులు చెబుతున్నారు.