మెడికో ప్రీతి కేసు:ఎంజీఎంలో వార్డులను పరిశీలించిన సీపీ రంగనాథ్
వరంగల్ మెడికో ప్రీతి మృతి కేసు విషయమై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సైఫ్ ను ఇటీవలనే పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.
వరంగల్: మెడికో ప్రీతి మృతి కేసుపై వరంగల్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ ఎంజీఎం పలు వార్డులను సీపీ రంగనాధ్ గురువారం నాడు పరిశీలించారు.గత నెల 22వ తేదీన వరంగల్ కేఎంసీలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అక్కడి నుండి ఆమెను మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ నిమ్స్ కు తరలించారు.హైద్రాబాద్ నిమ్స్ లో చికిత్స తీసుకుంటూ ఆమె మృతి చెందారు.
కేఎంసీలో సీనియర్ సైఫ్ వేధింపుల కారణంగానే మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకుందని వరంగల్ పోలీసులు ప్రకటించారు. ఈ విషయమై సీనియర్ సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేుసులో సైఫ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
also read:ఆ శాంపిల్స్‌తో వాస్తవ రిపోర్టు రాదు.. మా కూతురిది హత్యే.. నిందితులను శిక్షించాలి: ప్రీతి తండ్రి
మెడికో ప్రీతి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రీతిని హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెడికో ప్రీతి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసును పోలీసులు మరింత సీరియస్ గా తీసుకున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని అనస్తీయా విభాగం , ఆర్ఐసీయూ విభాగంలోని వార్డులను వరంగల్ సీపీ రంగనాథ్ పరిశీలించారు.
ప్రీతి సీనియర్ సైఫ్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో సేకరించిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కేఎంసీ అనస్తీయా విభాగం హెచ్ఓడీ నాగార్జునపై ప్రీతి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ఈ విషయాలపై కూడ పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం లేకపోలేదు.