మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం: సైఫ్ నకు 14 రోజుల రిమాండ్, ఖమ్మంకు తరలింపు

మెడికో ప్రీతి   ఆత్మహత్యాయత్నం  కేసులో  అరెస్టైన  సీనియర్  సైఫ్ ను పోలీసులు  ఖమ్మం  జైలుకు తరలించారు. 

Warangal Court  Orders  To  Remand  To  Senior Saif  in  Medico  Preethi  Suicide Attempt


వరంగల్ : మెడికో  ప్రీతి ఆత్మహత్యాయత్నం  కేసులో  అరెస్టైన   సీరియర్ సైఫ్ నకు  జడ్జి  14 రోజుల పాటు రిమాండ్  విధించింది.  నిందితుడు  సైఫ్ ను  పోలీసులు ఖమ్మం  కోర్టుకు తరలించారు.  

ఈ నెల  22న మెడికో  ప్రీతి ఆత్మహత్యాయత్నం  చేసుకుంది.   ఈ కేసులో  సీనియర్ సైఫ్ ను  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఇవాళ మేజిస్ట్రేట్  ముందు  హజరుపర్చారు.  నిందితుడికి  14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.  నిందితుడిని పోలీసులు ఖమ్మం జైలుకు తరలిస్తున్నారు. 

కేఎంసీ మెడికో  ప్రీతిని ఆమె సీనియర్ సైఫ్ వేధించినట్టుగా   పోలీసులు తమ దర్యాప్తులో  గుర్తించారు.  సైఫ్ వాట్సాప్ చాట్,  మెడికో ప్రీతి వాట్సాప్  చాట్ ల నుండి సమాచారం  సేకరించినట్టుగా  వరంగల్ సీపీ  రంగనాథ్  వివరించారు.  

ఈ నెల  22న  ఆత్మహత్యాయత్నం  చేసిన  మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా  ఉంది.  ఆమెకు నిమ్స్ ఆసుపత్రిలో  చికిత్స అందిస్తున్నారు.    ఎక్మో ద్వారా ప్రీతికి వైద్యం  అందిస్తున్నారు.  

మెడికో ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసిందా  ఇతరత్రా కారణాలతో  ఆమె  అస్వస్థతకు  గురైందా అనే  విషయమై  విచారణ చేస్తున్నామని  ఎంజీఎం  సూపరింటెండ్  డాక్టర్ చంద్రశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సైఫ్,  మెడికో ప్రీతి మధ్య వివాదానికి గల కారణాలపై  కూడా  ప్రొఫెసర్ల కమిటీ విచారణ నిర్వహిస్తుందని  డాక్టర్  చంద్రశేఖర్ రెండు రోజుల క్రితం  ప్రకటించారు.

also read:మెడికో ప్రీతి ఆరోగ్యం మెరుగుపడుతుంది: మంత్రి సత్యవతి రాథోడ్

మెడికో ప్రీతి  ఆరోగ్య పరిస్థితిపై  ఇవాళ  నిమ్స్ వైద్యుల బృందం  హెల్త్ బులెటిన్ విడుదల  చేసింది.  కిడ్నీ,గుండె పనితీరు మెరుగుపడినట్టుగా  ప్రకటించారు. అయితే  ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు  తేల్చి చెప్పారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios