మెడికో ప్రీతి ఆరోగ్యం మెరుగుపడుతుంది: మంత్రి సత్యవతి రాథోడ్

మెడికో  ప్రీతి  కుటుంబసభ్యులను  మంత్రి సత్యవతి రాథోడ్  ఇవాళ  నిమ్స్ లో పరామర్శించారు.  
 

Telangana Minister  satyavathi rathod  Reacts  on  Medico  Preethi  health  condition


హైదరాబాద్:మెడికో  ప్రీతి  ఆరోగ్యం  మెరుగుపడుతుందని  తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్  చెప్పారు. శుక్రవారం నాడు  హైద్రాబాద్ నిమ్స్ లో  మెడికో  ప్రీతి కుటుంబ సభ్యులను  మంత్రి పరామర్శించారు. ఐసీయులో  మెడికో  ప్రీతికి అందుతున్న చికిత్సను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రీతి ఆరోగ్యం గురించి వైద్య సిబ్బంది  నుండి  వివరాలను  అడిగితెలుసుకున్నారు.  అనంతరం  ఆమె మీడియాతో మాట్లాడారు. 

 మెడికో ప్రీతి ఆరోగ్యం  కుదుటపడుతుందని మంత్రి చెప్పారు.  వైద్యుల చికిత్సకు  స్పందిస్తుందని మంత్రి తెలిపారు. అప్పుడప్పుడూ  కళ్లు తెరిచి చూస్తుందని  మంత్రి  వివరించారు.

ప్రీతి   ఆరోగ్యం  ఇవాళ   కొద్దిగా  మెరుగుపడిందన్నారు.  ప్రీతి ఆత్మహత్యాయత్నానికి  కారణం  ఎవరైనా  వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  ఆమె  తేల్చి చెప్పారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని  మంత్రి   తెలిపారు.

ఈ నెల  22న మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకుందని  కుటుంబసభ్యులు  చెబుతున్నారు. వరంగల్  ఎంజీఎం  ఆసుపత్రిలో  ప్రీతికి  చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం  డాక్టర్ ప్రీతిని  నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.   నిమ్స్  ఆసుపత్రిలో  మెడికో ప్రీతికి  ఎక్మో ద్వారా  చికిత్స అందిస్తున్నారు. 

also read:మెడికో ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి అవమానించాడు: వరంగల్ సీపీ రంగనాథ్

  సీనియర్ వేధింపుల వల్లే మెడికో ప్రీతి  ఆత్మహత్యాయత్నం చేసుకొందని  పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై  కాలేజీ  యాజమాన్యానికి  ఫిర్యాదు  చేసినా ఫలితం లేదన్నారు.  మెడికో ప్రీతి  తండ్రి ఫిర్యాదు మేరకు  వరంగల్ పోలీసులు  కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు ఈ ఘటనలో  సైఫ్  ను  వరంగల్  పోలీసులు అరెస్ట్  చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios