తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలన్న డిమాండ్ తో ఓరుగల్లు భారతీయ యువమోర్చా పోరుబాట పట్టింది. వరంగల్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. బిజెవైఎం నేతలు.  భారతీయ జనతా యువ మోర్చా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గుండమీది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు.

హన్మకొండ అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడారు. తెలంగాణ సర్కారు నిరుద్యోగ సమస్యను పరిస్కరించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

సచివాలయం కట్టుడు, అసెంబ్లీ కట్టుడు ఎవరికోసమని ప్రశ్నించారు. తక్షణమే ఉద్యోగాలు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చిరంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా బీజేపీ , బిజెవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.