MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • Liquor : ఇంట్లో ఎంత లిక్కర్ పెట్టుకోవచ్చు? ఏ రాష్ట్రంలో ఎంత లిమిట్..?

Liquor : ఇంట్లో ఎంత లిక్కర్ పెట్టుకోవచ్చు? ఏ రాష్ట్రంలో ఎంత లిమిట్..?

కొందరు వ్యక్తిగత అవసరాలకు, మరికొందుకు ఫంక్షన్లు, పార్టీల కోసం మందు బాటిళ్లు కొని ఇంట్లో నిల్వ చేస్తుంటారు. కానీ చట్ట ప్రకారం ఇంట్లో ఎంతపడితే అంత మందు ఉంచుకోవద్దు… ఒక్కో రాష్ట్రంలో ఒక్కో లిమిట్ ఉంది. ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 12 2026, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇంట్లో ఎంత మందు ఉండవచ్చు..?
Image Credit : freepik

ఇంట్లో ఎంత మందు ఉండవచ్చు..?

ఒకప్పుడు కుటుంసభ్యులకు తెలియకుండా దొంగచాటుగా మందు తాగేవాళ్లు… ఇప్పుడు కుటుంబమంతా కలిసి కూర్చుని మందుపార్టీలు చేసుకుంటున్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అయితే పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లోనే కాదు చావు వంటి బాధాకరమైన సందర్భాల్లో కూడా పక్కా మందు ఉండాల్సిందే.

ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా మందు తాగేవారి సంఖ్య బాగా పెరిగింది.. ఇంట్లోనే మందు తాగేవారూ పెరిగారు. ఈ క్రమంలో చాలామంది వ్యక్తిగత అవసరాల కోసం ఇంట్లో మందు నిల్వ చేస్తుంటారు. కానీ చట్ట ప్రకారం పరిమితికి మించి ఇంట్లో మందు దాచడం నేరం… ఎక్సైజ్ పోలీసులు యాక్షన్ తీసుకోవచ్చు. మరి ఇంట్లో ఎంత మందు ఉంచుకోవచ్చు..? రాష్ట్రాల వారీగా ఈ రూల్స్ మారుతుంటాయి… ఏ రాష్ట్రంలో ఎంత మందు ఇంట్లో దాచుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తెలుగు ప్రజలు ఇంట్లో ఎంత మందు దాచుకోవచ్చు..?
Image Credit : freepik

తెలుగు ప్రజలు ఇంట్లో ఎంత మందు దాచుకోవచ్చు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పర్మిట్ లేకుండా 3 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) లేదా ఫారిన్ లిక్కర్ బాటిళ్లు లేదా ఆరు బీర్ బాటిళ్లు ఇంట్లో పెట్టుకోవచ్చు. అదే తెలంగాణలో అయితే ఈ పరిమితి కాస్త ఎక్కువగా ఉంది. ఆరు ఫుల్ బాటిల్స్ (750ml) అంటే 4.5 లీటర్ల వరకు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) లేదా విదేశీ మందు ఇంట్లో ఉంచుకోవచ్చు. బీర్లు అయితే ఆరు బాటిల్స్ ఉంచుకోవచ్చు.

Related Articles

Related image1
Child Psychology: పిల్లల ముందు తండ్రి మద్యం తాగితే ఏమౌతుంది?
Related image2
Cheapest Alcohol: ఆ చిన్నదేశాల్లో బ్రాండెడ్ మద్యం బాటిల్ ధర రూ.50 లోపే
36
ఏ రాష్ట్రప్రజలు ఇంట్లో ఎంత మందు దాచుకోవచ్చు..?
Image Credit : Getty

ఏ రాష్ట్రప్రజలు ఇంట్లో ఎంత మందు దాచుకోవచ్చు..?

గోవాలో అయితే ఇంట్లోనే చిన్న బార్ పెట్టుకునే స్థాయిలో మందు పెట్టుకునేందుకు అనుమతి ఉంటుంది. 12 IMFL బాటిళ్లు, 24 బీర్ బాటిళ్లు, 18 దేశీ మందు బాటిళ్లు, 6 రెక్టిఫైడ్ స్పిరిట్ బాటిళ్లు ఇంట్లో ఉంచుకోడానికి గోవాలో అనుమతి ఉంటుంది. ఇదే స్థాయిలో హిమాచల్ ప్రదేశ్‌లో కూడా మందు ఇంట్లో దాచుకోవచ్చు.. ఇక్కడ 48 బీర్ బాటిళ్లు, 36 విస్కీ బాటిళ్లు పెట్టుకోవచ్చు.

కేరళలో 3 లీటర్ల IMFL, 6 లీటర్ల బీర్ బాటిల్ ఇంట్లో దాచుకోడానికి అనుమతి ఉంది. మధ్య ప్రదేశ్‌లో ఎక్కువ ఆదాయం ఉన్నవారు 100 'ఖరీదైన' మందు బాటిళ్లను ఇంట్లో పెట్టుకోవచ్చు. రాజస్థాన్‌లో 12 బాటిళ్ల (లేదా 9 లీటర్ల) IMFL వరకు ఇంట్లో ఉంచుకోవచ్చు.

అరుణాచల్ ప్రదేశ్‌లో లైసెన్స్ లేకుండా 18 లీటర్ల కంటే ఎక్కువ IMFL లేదా దేశీ మందు ఉంచడం చట్టవిరుద్ధం. ఇక్కడ 21 ఏళ్లు దాటిన వారు 6 IMFL బాటిళ్లు (ఒక్కొక్కటి 750 ml), 18 బీర్ బాటిళ్లు నిల్వ చేసుకోవచ్చు. అసోంలో రిటైల్ షాపులు ఒక రోజులో 12 IMFL బాటిళ్లు, 4.5 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్, 3 దేశీ మందు బాటిళ్లు (ఒక్కొక్కటి 750 ml) అమ్మవచ్చు.

46
దేశ రాజధానిలో మందు లిమిట్ ఎంత?
Image Credit : Getty

దేశ రాజధానిలో మందు లిమిట్ ఎంత?

ఢిల్లీ వాసులు తమ ఇంట్లో 18 లీటర్ల వరకు మందు నిల్వ చేసుకోవచ్చు. ఇందులో బీర్, వైన్ రెండూ ఉంటాయి. అయితే 9 లీటర్లకు మించి రమ్, విస్కీ, వోడ్కా లేదా జిన్ ఉంచుకోవడానికి వీల్లేదు. ఢిల్లీ నుంచి వేరే ప్రాంతానికి మందు తీసుకెళ్లాలంటే, ఒక వ్యక్తి కేవలం ఒక లీటర్ మాత్రమే తీసుకెళ్లగలడు.

56
హర్యానా, పంజాబ్ సంగతేంటి..?
Image Credit : freepik

హర్యానా, పంజాబ్ సంగతేంటి..?

హర్యానాాలో ఒక వ్యక్తి 6 దేశీ మందు బాటిళ్లు (ఒక్కొక్కటి 750 ml), 18 IMFL (750 ml), 6 దిగుమతి చేసుకున్న ఫారిన్ లిక్కర్ బాటిళ్లు, 12 బీర్ బాటిళ్లు (650 ml), 6 రమ్ బాటిళ్లు (750 ml) ఉంచుకోవచ్చు. వీటితో పాటు 6 వోడ్కా/సైడర్/జిన్ బాటిళ్లు (750 ml), 12 వైన్ బాటిళ్లు కూడా పెట్టుకోవచ్చు. పంజాబ్‌లో 1.5 లీటర్ల ఫారిన్ లిక్కర్ (ఇండియన్, ఇంపోర్టెడ్), 2 లీటర్ల వైన్, 6 లీటర్ల బీర్ ఉంచుకోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో కూడా దాదాపు ఇదే పరిమితి వర్తిస్తుంది.

66
తమిళనాడు ప్రజలు ఇంట్లో ఎంత మందు దాచుకోవచ్చు..?
Image Credit : Getty

తమిళనాడు ప్రజలు ఇంట్లో ఎంత మందు దాచుకోవచ్చు..?

తమిళనాడులో ఒక వ్యక్తి 4.5 లీటర్ల వరకు మందు ఇంట్లో ఉంచుకోవచ్చు. బార్ ఏరియాలోనే మందు సర్వ్ చేయాలని అక్కడి నిబంధన. జమ్మూ కాశ్మీర్‌లో 12 IMFL బాటిళ్లు, 12 బీర్ బాటిళ్లు (650 ml) ఇంట్లో పెట్టుకోవచ్చు. మిజోరం, గుజరాత్, బీహార్, నాగాలాండ్, లక్షద్వీప్ వంటి రాష్ట్రాల్లో మందుపై పూర్తి నిషేధం ఉంది. ఇక్కడ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం
Recommended image2
RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం
Recommended image3
LPG: మరో మూడు రోజులే టైముంది.. వెంటనే ఈ పనిచేయకపోతే మీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కట్ !
Related Stories
Recommended image1
Child Psychology: పిల్లల ముందు తండ్రి మద్యం తాగితే ఏమౌతుంది?
Recommended image2
Cheapest Alcohol: ఆ చిన్నదేశాల్లో బ్రాండెడ్ మద్యం బాటిల్ ధర రూ.50 లోపే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved