హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. టిప్పు విషయంలో యువకులను వెయిటర్ చితకబాదిన ఘటన శంషాబాద్ లో కలకలం రేపింది. Shamshabad Municipality పరిధిలోని ఎయిర్ పోర్ట్ బావర్చి హోటల్ లో బిర్యానీ తినేందుకు వచ్చిన స్థానిక యువకులమీద వెయిటర్ దాడి చేశాడు.
హైదరాబాద్ : హోటల్ కి వెళ్లి ఏదైనా తిన్నారనుకోండీ.. బిల్లు తో పాటు కాస్తో, కూస్తో టిప్పు ఇస్తారు. వెయిటర్ సేవలు నచ్చినా, నచ్చకపోయినా.. అదో మర్యాద. టిప్పు ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది కస్టమర్ ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. అంతేకానీ తప్పనిసరి మాండేటరీ కాదు.
అది గల్లీ హోటల్ అయినా, స్టార్ హోటల్ అయినా వచ్చే కస్టమర్ ని బట్టి టిప్పు ఉంటుంది. అయితే, tip కోసం డిమాండ్ చేసే అధికారం waiters కు ఉండదు. కానీ హైదరాబాద్ లో ఓ వెయిటర్ మాత్రం ఈ రూల్ ను బ్రేక్ చేశాడు. టిప్పుకోసం డిమాండ్ చేశాడు. అంతటితో ఊరుకుంటే ఇది వార్తే కాకపోయేది. సదరు Customer ఇవ్వలేదని దాడికి దిగాడు. చితకబాదాడు. హోటల్ సిబ్బంది కూడా ఇందులో తలో చేయి వేయడం కొసమెరుపు. అసలు విషయంలోకి వెడితే...
TSRTC: ములుగు జిల్లాలో అర్ధరాత్రి ఆర్టిసి బస్సు దగ్దం... మావోయిస్టుల పనేనా?
హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. టిప్పు విషయంలో యువకులను వెయిటర్ చితకబాదిన ఘటన శంషాబాద్ లో కలకలం రేపింది. Shamshabad Municipality పరిధిలోని ఎయిర్ పోర్ట్ బావర్చి హోటల్ లో బిర్యానీ తినేందుకు వచ్చిన స్థానిక యువకులమీద వెయిటర్ దాడి చేశాడు.
Biryani తిన్న తరువాత బిల్ చెల్లించి వెల్తున్న యువకులను తనకు టిప్పు ఇవ్వరా? అని వెయిటర్ అడిగాడు. అయితే యువకులు అతన్ని లైట్ గా తీసుకున్నారు. యువకులు టిప్పు ఇవ్వకపోవడంతో వెయిటర్ రెచ్చిపోయాడు. కోపంతో ఊగిపోయి యువకులను చితకబాదాడు. హోటల్ యాజమాన్యం కూడా యువకులమీద దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను సముదాయించారు. కాగా, గతంలో కూడా ఈ హోటల్ మీద పలు రకాల ఆరోపణలు వచ్చాయి. ఎయిర్ పోర్ట్ బావర్చి హోటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
