సినీతార విజయశాంతి ఇప్పుడెలా ఉన్నారంటే (వీడియో)

First Published 5, Feb 2018, 3:36 PM IST
vijayashanthi ready to move active politics
Highlights
  • త్వరలో యాక్టీవ్ పాలిటిక్స్ లోకి రాములమ్మ
  • ఎన్నికల్లో పోటీ పై త్వరలో క్లారిటీ

ఒకప్పుడు దక్షిణాదిని ఊపేసిన సినీతార విజయశాంతి. సినిమాల తర్వాత ఆమె రాజకీయాల్లో కాలు పెట్టారు. తల్లి తెలంగాణ అనే పేరుతో పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని టిఆర్ఎస్ లో విలీనం చేశారు. టిఆర్ఎస్ లో ఎంపిగా పనిచేశారు. కానీ కేసిఆర్ తో పొసగకపోవడంతో టిఆర్ఎస్ ను వీడక తప్పలేదు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఇప్పుడిప్పుడే తిరిగి రాజకీయాల్లో మళ్లీ దూకుడు పెంచుతానంటూ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో కలిసి చర్చించారు. ఆయన పోటీ చేయాలని సూచించినట్లు చెప్పారు. కానీ తనకు పోటీ చేయడం ఇష్టంలేదన్నారు రాములమ్మ. రాములమ్మ మీడియాతో ముచ్చటించి పనిలో పనిగా తెలంగాణ సిఎం కేసిఆర్ గురించి గట్టిగానే కామెంట్లు చేశారు.

మరి రాములమ్మ ఇప్పుడెలా ఉందో ఈ వీడియోలో చూడొచ్చు.

 

loader