రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టిడిపి ఎంపి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఇవాళ ఉదయం  మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని వెంకయ్య గుర్తుచేసుకున్నారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సందర్భంగా రాజ్య సభలో హరికృష్ణ తెలుగులో ప్రసంగించినపుడు తాను అదే సభలో ఉన్నట్లు వెంకయ్య గుర్తుచేసుకున్నారు. ఆయన తెలుగు ప్రసంగం అర్థం కాక రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పిజె.కురియన్ అడ్డుచెప్పారని తెలిపారు. అయితే ఆ ప్రసంగాన్ని తాను అనువాదం చేస్తానని, హరికృష్ణను మాట్లాడనివ్వాలని తాను కోరినట్లు వెంకయ్య తెలిపారు.

హరికృష్ణ వ్యక్తిత్వం గురించి కూడా ఉపరాష్ట్రపతి మాట్లాడారు. ముక్కుసూటితనం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా వున్న వ్యక్తి హరికృష్ణ అని వెంకయ్య ప్రశంసించారు. ఎన్టీఆర్ తనయుడిగా మంచి పేరును సంపాదించి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందారన్నారు. ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టే మనస్తత్వమున్న హరికృష్ణ రాజ్యసభలోనూ అలాగే వ్యవహరించేవారని గుర్తుచేశారు.

హరికృష్ణ మృతి తెలుగు ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటని వెంకయ్య అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు. 
 

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

హరికృష్ణ అంతిమయాత్ర: పాడె మోసిన చంద్రబాబు, జాస్తి చలమేశ్వర్

రవాణా మంత్రిగా హరికృష్ణ సంచలన నిర్ణయం....తెలుగింటి మహిళల కోసం....

హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించిన వైసీపీ నేతలు

హరికృష్ణ మృతి...ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రోజులు సంతాప దినాలు