హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించిన వైసీపీ నేతలు

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 30, Aug 2018, 1:39 PM IST
ycp leaders tribute harikrishna
Highlights

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సినీనటుడు మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులర్పించారు. మెహిదీపట్నంలో హరికృష్ణ నివాసంలో ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అంబటి రాంబాబు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. 

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సినీనటుడు మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులర్పించారు. మెహిదీపట్నంలో హరికృష్ణ నివాసంలో ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అంబటి రాంబాబు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. 

హరికృష్ణ మరణం తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  హరికృష్ణ కటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ గొప్ప మనసున్న వ్యక్తి అని వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ముక్కుసూటి తనంతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని..నిక్కచ్చిగా ఉంటారన్నారు. అంతటి మంచి మనిషి మనం కోల్పోవడం దురదృష్టకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నామని తెలిపారు. 

మరోవైపు హరికృష్ణ భౌతిక కాయానికి మాజీ ఎంపీ మైసూరారెడ్డి నివాళులర్పించారు. రెండు సార్లు హరికృష్ణతో కలిసి రాజ్యసభలో పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ముందుండి ఎంతో ధైర్యం చెప్పేవారని తెలిపారు. సమస్యలపై భయపడే నైజం హరికృష్ణకు ఉండేది కాదని మైసూరా రెడ్డి స్పష్టం చేశారు.  

loader