Asianet News TeluguAsianet News Telugu

హరికృష్ణ అంత్యక్రియలు: చితికి నిప్పంటించిన కళ్యాణ్‌రామ్


టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం నాడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ చితికి నిప్పంటించాడు. 

Harikrishna final journey starts in hyderabad
Author
Hyderabad, First Published Aug 30, 2018, 2:19 PM IST


హైదరాబాద్: టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం నాడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ చితికి నిప్పంటించాడు. 

మహాప్రస్థానంలో సాంప్రదాయం ప్రకారంగా కార్యక్రమాలను నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని ఆదేశించింది. దరిమిలా హరికృష్ణ అంత్యక్రియలు జరిగే సమయంలో  పోలీసులు గౌరవ సూచికంగా గాల్లోకి కాల్పులు జరిపారు. 

కడసారి చూసేందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు  మహా ప్రస్థానానికి చేరుకొన్నారు.. మధ్యాహ్నం రెండుగంటలకు ప్రారంభమైన యాత్ర సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానానికి చేరుకొంది.

మెహిదిపట్నంలోని  హరికృష్ణ నివాసం నుండి మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభమైంది. హరికృష్ణ నివాసం నుండి అంతిమయాత్రను తీసుకెళ్లే రథం వరకు  పార్థీవ దేహన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, సుప్రీం కోర్టు మాజీ జడ్జి జాస్తి చలమేశ్వర్  తీసుకెళ్లారు.

"

మహాప్రస్థానం వద్ద వాహనం నుండి పార్థీవ దేహన్ని దింపిన తర్వాత జాస్తి చలమేశ్వర్, చంద్రబాబునాయుడు, మరికృష్ణ సోదరులు బాలకృష్ణ, జయకృష్ణలు కూడ పాడె మోశారు. మధ్యాహ్నాం మోహిదీపట్నంలోని హరికృష్ణ నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభమైంది.

టీడీపీ కార్యకర్తలు, నాయకులు , నందమూరి, నారా కుటుంబసభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రముఖులు , పలు రాజకీయ పార్టీల ప్రముఖులు  ర్యాలీలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మహాప్రస్థానంలో  హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

తొలుత జానకీరామ్  అంత్యక్రియలు నిర్వహించిన మోయినాబాద్ సమీపంలోని ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహించాలని భావించినప్పటికీ   చివరకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.  హరికృష్ణ తనయుడు కళ్యాణ్ ‌రామ్  ముందు నడవగా సోదరుడిని జూనియర్ ఎన్టీఆర్ ఇతర కుటుంబసభ్యులు అనుసరించారు.

హరికృష్ణ అంత్యక్రియలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం  ప్రధాన కార్యదర్వి ఎస్ కే జోషీకి ఈ మేరకు  ఆదేశాలు జారీ చేశారు.

అంతిమ యాత్ర సాగే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మెహిదీపట్నం నుండి గచ్చిభౌలివరకు ట్రాఫిక్ జాం అయింది. మరోవైపు హరికృష్ణ అంతిమయాత్ర సాగే దారిలో రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. అంతిమయాత్రకు ఇబ్బంది కాకుండా ఉండేలా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

ఈ వార్తలు చదవండి

హరికృష్ణ మృతి: రాత్రి ఒకటిన్నరకు నిద్ర లేపాలని అడిగారు

హరికృష్ణ వెంట ఎప్పుడూ ఆ ఇద్దరే..

నందమూరి కుటుంబానికి ఈ రహదారి శాపం: యాక్సిడెంట్ జోన్లు ఇవే

హరికృష్ణ మృతి: వస్తానంటే ఆ డ్రైవర్‌ను వద్దన్నాడు

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

Follow Us:
Download App:
  • android
  • ios