హైద్రాబాద్‌లో భారీ వర్షానికి కుంగిన రోడ్డు:శంకర్‌మఠ్ నుండి వీఎస్టీ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేత


భారీ వర్షానికి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన రోడ్డు కుంగిపోయింది. దీంతో హైద్రాబాద్ శంకర్ మఠ్ నుండి వీఎస్టీకి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
 

Vehicles Diverts After Road Damaged At Shankar Math  In Hyderabad

హైదరాబాద్:  హైద్రాబాద్ శంకర్ మఠ్ నుండి వీఎస్టీ మార్గంలో Heavy Rainsకి రోడ్డు కుంగిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు అధికారులు.
 
బుధవారంనాడు తెల్లవారుజామున Hyderabad లో భారీ వర్షం కురిసింది.ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.హైద్రాబాద్ పాతబస్తీలో పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది.  వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా వీచాయి. దీంతో  చెట్లు కూడా విరిగాయి.  పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

స్టీల్ Bridge  నిర్మాణం కోసం Shankar Math  ప్రాంతంలో రోడ్డును తవ్వారు. అయితే  రాత్రి కురిసిన వర్షానికి ఈ ప్రాంతంలో రోడ్డు కుంగిపోయింది. శంకర్ మఠ్ నుండి VST మార్గంలలో రోడ్డు కుంగిపోవడంతో ముందు జాగ్రత్తగా అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

మంగళవారం నాడు రాత్రి నుండి బుధవారం తెల్లవారుజాము వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురిసినట్టుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రానున్న మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో అత్యధికంగా 7.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైద్రాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది.

అకాల వర్షంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దైంది. మరికొన్ని చోట్ల వరి ధాన్యం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. వర్షం వస్తే వరిధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు, ప్లాస్టిక్ కవర్లు లేక ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఆలస్యంగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతోనే రైతులు ఇవాళ ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి, వెల్గటూర్ మండలంలోని రామనూర్, ఖిలావనపర్తి, నర్సింహులపల్లి, ధర్మారం, గర్రెపల్లిల్లో వరి పంట నీట మునిగింది. జగిత్యాల జిల్లాలోని సరంగపూర్ లో 64 మి.మీ వర్షపాతం నమోదైంది.ధర్మపురి, సిరికొండల్లో 61.5 మి.మీ. వెల్గటూరులో 45.8 మి.మీ కోల్వాయి లో 40.8 మి.మీ వర్షపాతం నమోదైంది.గంగాధరలో 40.8 మి.మీ. ఎదులాపల్లిలో 31.0 మి.మీ.జమ్మికుంటలో 30.8 మి.మీ వర్షపాతం రికార్డైంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి, నిమ్మ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిప్పర్తి మండలం పజ్జారులో 98 మి.మీ. వర్షపాతం నమోదైంది. చింతపల్లి, పెద్దఅడిశర్లపల్లి, త్రిపురారం, తిరుమలగిరి, కట్టంగూరు, నిడమనూరులలో ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.యాదాద్రి భువనగరి జిల్లాలో ఈదురు గాలులకు చెట్లు నేలకూలాయి. దీంతో ట్రాపిక్ కు అంతరాయం ఏర్పడింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios