Asianet News TeluguAsianet News Telugu

నెలల తర్వాత మాతృదేశానికి: అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న మరో విమానం

లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ వందే భారత్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రస్తుతం చురుగ్గా సాగుతోంది.

vande bharat mission 120 people stranded in usa land in hyderabad
Author
Hyderabad, First Published May 11, 2020, 2:30 PM IST

లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ వందే భారత్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రస్తుతం చురుగ్గా సాగుతోంది.

ఇప్పటికే పలు దేశాల నుంచి భారతీయులతో వున్న విమానాలు దేశంలోని వివిధ నగరాల్లో ల్యాండ్ అవుతున్నాయి. తాజాగా సోమవారం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం చేరుకుంది.

Also Read:లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఎయిర్ పోర్టులో 54రోజులుగా ఒక్కడే!

ఈ విమానంలో అమెరికా నుంచి వయ ముంబై మీదుగా 120 మంది ప్రయాణికులు హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి  ఇమ్మిగ్రేషన్, పర్సనల్‌ చెకింగ్ ఆ తర్వాత థర్మల్ స్క్రీనింగ్ పూర్తి చేసి.. అక్కడి నుంచి నేరుగా పెయిడ్ క్వారంటైన్‌కు తరలించనున్నారు.

ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు అధికారులు. కాగా పెయిడ్ క్వారంటైన్ కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు హోటళ్లను తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Also Read:ఇండియాలో కరోనా కాటు: 67 వేలు దాటిన కేసులు, 2 వేలు దాటిన మరణాలు

విదేశాల నుంచి భారతదేశానికి చేరుకున్న వారిని పెయిడ్ క్వారంటైన్ కేంద్రాల్లో పెట్టి.. వాళ్లకు కావాల్సినవి సమకూరుస్తారు. క్వారంటైన్ సమయం ముగిసిన తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించి అనంతరం స్వస్థలాలకు పంపనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios