Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఎయిర్ పోర్టులో 54రోజులుగా ఒక్కడే!

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టర్కీ నుంచి, అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమానాలను భారత్ రద్దు చేసింది. నాలుగు రోజుల తర్వాత అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించి కొనసాగిస్తోంది.
 

Covid19 lockdown fallout: German man living at Delhi airport since March 18
Author
Hyderabad, First Published May 11, 2020, 12:02 PM IST

కరోనా లాక్ డౌన్ కారణంగా ఓ వ్యక్తి ఎయిర్ పోర్టులో చిక్కుకున్నాడు. ఒక్క రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా 54రోజులపాటు ఎయిర్ పోర్టులో ఒక్కడే ఉన్నాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో జర్మనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఎడ్గార్డ్ జీబాట్ అనే జర్మన్‌ జాతీయుడు 54 రోజులుగా ఒంటరిగా ఇక్కడే ఉండిపోయాడు. మార్చి 18న హనోయి నుంచి ఇస్తాంబుల్‌కు వెళుతూ అతడు ఇక్కడ చిక్కుకున్నాడు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టర్కీ నుంచి, అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమానాలను భారత్ రద్దు చేసింది. నాలుగు రోజుల తర్వాత అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించి కొనసాగిస్తోంది.

ఇతర ప్రయాణికుల మాదిరిగా ఎడ్గార్డ్ జీబాట్‌ను జర్మనీ రాయబార కార్యాలయానికి అప్పగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ దేశంలో అతడికి నేరచరిత్ర ఉన్నందున అతడిని క్వారంటై​న్‌ను పంపడానికి ఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయం నిరాకరించింది. నేర చరిత్ర ఉన్నందున భారత్‌ కూడా అతడికి వీసా ఇవ్వలేదు. 

అతడిని స్వదేశానికి పంపే విషయంపై జర్మన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఇప్పటివరకు స్పందన రాలేదని భారత అధికారులు తెలిపారు. జీబాట్‌ మార్చిన 18న వియత్నాం నుంచి వీట్‌జెట్‌ ఎయిర్ విమానంలో ఢిల్లీ వచ్చాడు. తన గమ్యస్థానానికి వెళ్లే విమానాలన్నీ రద్దు కావడంతో ఇక్కడే ఉండిపోయాడు.

దినపత్రికలు, మేగజీన్స్‌ చదువుతూ.. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ అతడు కాలక్షేపం చేస్తున్నాడు. తాను కోరుకున్న చోటికి వెళ్లిపోవచ్చని చెప్పినా విమాన సర్వీసులు లేకపోవడంతో అతడు వెళ్లలేకపోతున్నాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. దాదాపు 54 రోజులు అతను ఒక్కడే అక్కడ నిరీక్షించడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios