టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను మరికొద్దిరోజుల్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

మంగళవారం హుజూర్‌నగర్‌ కాంగ్రెస్ కార్యాలయంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలతో కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీపీ బాధ్యతలతో సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నానని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఉత్తమ్ స్పష్టం చేశారు. అప్పటి నుంచి హుజూర్‌నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.

Also Read:నన్ను తిడితే... ఒక్కరు కూడా పట్టించుకోరా! :ఉత్తమ్ ఆవేదన

కాగా కొద్దిరోజుల క్రితం కోర్ కమిటీ సభ్యులపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌‌ విడుదలపై తాను మాట్లాడితే టీఆర్ఎస్ ఎదురుదాడికి చేసిందని.. కానీ పీసీసీ చీఫ్‌ని తిడితే ఒక్క కాంగ్రెస్ నేత కూడా కౌంటర్ ఇవ్వలేదని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు.

వరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి కదా అని నిలదీశార్ పీసీసీ చీఫ్. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడటం సరికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చురకలంటించారు. మరో నేత షబ్బీర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతలు బీసీ, రెడ్లుగా చీలిపోయి పీసీసీ పంచాయితీలోనే ఉన్నారన్నారు. 

Also Read:మేం పవర్‌లోకి వస్తే.. నీకు తిప్పలే: ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

అదే సమయంలో కోర్ కమిటీలో సభ్యులు కానివారిని సమావేశానికి ఎలా పిలుస్తారంటూ సీనియర్ నేత వీహెచ్ అలిగి బయటకు వెళ్లిపోయారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏ ఒక్కరిపైనా ఆగ్రహం వ్యక్తం చేయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు కారణమైంది.