Hyderabad : తాపీ మేస్త్రీకి .రూ.4 లక్షల జీతమా...! అదీ యూఎస్ కాన్సులేట్ లో..!

హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఇందులో నైపుణ్యం కలిగిన తాపీ మేస్త్రీల నుండి దరఖాస్తులను ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఈ ఉద్యోగానికి జీతమెంతో తెలుసా..? 

US Consulate in Hyderabad invites mason job applications AKP

హైదరాబాద్ : మీరు తాపీ మేస్త్రీనా... మీకు ఇంగ్లీష్, హిందీ బాషపై పట్టు వుందా... కనీస విద్యార్హతలు వున్నాయా...  అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. మంచి వేతనంతో ఏకంగా అమెరికా కాన్సులేట్ లో ఉద్యోగం చేసే అద్భుత అవకాశాన్ని పొందండి. ఏంటీ... ఇంజనీరింగ్, డిగ్రీలు, పిజిలు చేసిన వారే ఉద్యోగాలు లేక ఇబ్బందిపడుతుంటే తాపీ మేస్త్రికి ఉద్యోగమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వార్తను పూర్తిగా చదవండి. 

హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లోని కొన్ని  ఉద్యోగ భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ నియామకాలకు సంబంధించి ప్రకటనను ఎక్స్(ట్విట్టర్) వేదికన పోస్ట్ చేసారు అధికారులు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఉద్యోగ నియామక ప్రకటనను చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఓ తాపీ మేస్త్రీని నియమించుకునేందుకు యూఎస్ కాన్సులేట్ సిద్దమవడం... మంచి నైపుణ్యం కలిగిన వారిని ఆహ్వానించడమే అందరి ఆశ్చర్యానికి కారణం. 

హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ లో తాపి మేస్త్రీగా పనిచేయాలంటే తప్పనిసరిగా హిందీ, ఇంగ్లీష్ వచ్చివుండాలట. అలాగే కనీస విద్యార్హత ఎనిమిదో తరగతి. మేస్త్రీగా మంచి నైపుణ్యం కలిగివుండి రెండేళ్లపాటు అనభవం కలిగివుండాలి. ఈ అర్హతలన్నీ కలిగివున్నా పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించిన నియమించుకోనున్నట్లు యూఎస్ కాన్సులేట్ తెలిపింది. ఇలా నియమింపబడే మేస్త్రీకి 4.47 లక్షల రూపాయల వార్షిక వేతనం ఆఫర్ చేసింది హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్. 

Also Read  TSPSC Group 1: గ్రూప్‌ - 1పై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం
  
ఈ తాపీ మేస్త్రీ ఉద్యోగానికి అర్హత గలవారు ఫిబ్రవరి 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని కాన్సులేట్ తెలిపింది. పూర్తి వివరాల కోసం https://in.usembassy.gov/embassy-consulates/jobs/hyderabad/ సందర్శించండి.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios