హైదరాబాద్: టీవీ నటి, బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీకకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి పరోక్షంగా బెదిరింపులు ఎదురయ్యాయి.  ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ స్థానంనుండి కత్తి కార్తీక స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

also read:దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు: సోలిపేట రామలింగారెడ్డి భార్యకే టీఆర్ఎస్ టిక్కెట్టు?

కత్తి కార్తీక డ్రైవర్  బైక్ పై గురువారం నాడు హైద్రాబాద్ నుండి రామాయంపేటకువెళ్తున్నాడు. రామాయంపేటలోని అడిగాస్ హోటల్ వద్ద ఇన్నోవాలో వచ్చిన నలుగురు వ్యక్తులు ఆయనను అడ్డగించారు. 

కత్తి కార్తీకతో పాటు నువ్వు కూడ అన్నీ సర్దుకొని పారిపోండి... లేదంటే కాల్చిపారేస్తాం అని హెచ్చరించారు. ఈ విషయాన్ని డ్రైవర్ కత్తి కార్తీకకు ఫోన్ చేసి చెప్పాడు. 

also read:కేసీఆర్, చాడ వెంకట్ రెడ్డి భేటీ వెనుక అంతర్యం ఇదేనా?

దీంతో కార్తీక తన కారులో రామాయంపేట అడిగాస్ హోటల్ వద్దకు చేరుకొంది. డ్రైవర్ నుండి వివరాలు తెలుసుకొంది.  వెంటనే ఆమె అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆమె చెప్పారు. తనను బెదిరిస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరారు.