Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ అండతోనే ఎంఐఎం రెచ్చిపోతోంది: భైంసాలో కిషన్ రెడ్డి

అధికార టీఆర్ఎస్ అండదండలతోనే మజ్లిస్ పార్టీ అల్లర్లు సృష్టిస్తోందని ఆరోపించారు. కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల బారి నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

union minister kishan reddy slams aimim and trs in nirmal
Author
Nirmal, First Published Feb 16, 2020, 8:41 PM IST

కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం నిర్మల్  జిల్లా తల్వేద గ్రామంలో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా భైంసా అల్లర్ల బాధితులను ఆయన పరామర్శించారు. మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్, ఎంఐఎంలపై విరుచుకుపడ్డారు. అధికార టీఆర్ఎస్ అండదండలతోనే మజ్లిస్ పార్టీ అల్లర్లు సృష్టిస్తోందని ఆరోపించారు.

Also Read:తెలంగాణ ఉద్యమ సూరీడు: కేసీఆర్ చరిత్ర ఇదీ

కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల బారి నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిన నిధులపై కేసీఆర్, కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్రమంత్రి సవాల్ విసిరారు.

సబ్సిడీ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం రూ.28 భరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2 మాత్రమే భరిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

Also Read:కేసీఆర్ ఆలోచన: తనయ కవితకు నో, రాజ్యసభకు పొంగులేటి

దేశవ్యాప్తంగా రైతులకు ఎకరానికి రూ.6 వేలు ఇస్తుంటే.. కేసీఆర్, కేటీఆర్‌లకు కనిపించడం లేదా అని మంత్రి నిలదీశారు. గల్లీలకు పరిమితమైన ఎంఐఎం అల్లర్లను భైంసా వరకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. అల్లర్ల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. ఈ ప్రాంతం చాలా సున్నిత ప్రాంతమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బాధితులకు నష్టపరిహారం వచ్చేలా చూస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా కేంద్రమంత్రిగా ఒక నెల జీతాన్ని భైంసా బాధితులకు ఇస్తానని ప్రకటించారు. ఓ గిరిజన బిడ్డను ఆదిలాబాద్ ప్రజలు ఎంపీగా గెలిపించడం శుభ పరిణామం అని ఆయన వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios