తెలంగాణ ఉద్యమ సూరీడు: కేసీఆర్ చరిత్ర ఇదీ

First Published 16, Feb 2020, 7:30 PM IST

తలెంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచి రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ కేీలకంగా వ్యవహరించారు.తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి 17వ తేదీతో 66 ఏళ్లు పూర్తి చేసుకొని 67 ఏటలోకి అడుగుపెట్టనున్నారు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని విస్తృతంగా మొక్కలు నాటాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. వరుసగా రెండో దఫా కూడ తెలంగాణ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17వ తేదీన రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో జన్మించారు. గ్రామంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. సిద్దిపేటలో డిగ్రీ కాలేజీలో ఆయన డిగ్రీని పూర్తి చేశాడు. చరిత్ర, రాజనీతి శాస్త్రం పూర్తి చేశాడు.

1969 ఏప్రిల్ 23వ తేదీన శోభను వివాహం చేసుకొన్నాడు. కేసీఆర్‌కు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా పనిచేస్తున్నారు. కూతురు కవిత గత ఎన్నికల్లో నిజామాబాద్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

చిన్నతనం నుండి గురువుల నుండి తెలుగు భాషపై ఆయన మంచి పట్టును సాధించారు. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ కాలంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. సిద్దిపేట నుండి 1970 నుండి 1983 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన ఎ. మదన్ మోహన్ కేసీఆర్‌కు రాజకీయ గురువుగా చెబుతారు.

1983లో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 1983లో తొలిసారిగా సిద్దిపేట నుండి టీడీపీ అభ్యర్థిగా తన రాజకీయ గురువు మదన్‌మోహన్ పై కేసీఆర్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. మదన్ మోహన్ పై 877 ఓట్ల తేడాతో ఆయన ఓటమిని చవి చూశాడు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడ కేసీఆర్ ఓటమి చవిచూడలేదు.

1985లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నుండి కేసీఆర్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1989, 1994, 1999,2001 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుండి ఆయన విజయం సాధించారు. 1985 నుండి 1999 వరకు టీడీపీ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కేసీఆర్ విజయం సాధించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1995 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్ కు చోటు దక్కింది. చంద్రబాబు కేబినెట్ లో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 1997 నుండి 1999 వరకు కేసీఆర్ మంత్రిగా కొనసాగారు.

1999 ఎన్నికల్లో కూడ ఉమ్మడి రాష్ట్రంలో మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు తటస్థులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమయంలో సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుండి విజయరామారావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ధిగ్గజం పి. జనార్ధన్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు

విజయరామారావు కూడ వెలమ సామాజిక వర్గానికి చెందిన వాడు. కేసీఆర్ కూడ అదే సామాజికవర్గం. దీంతో చంద్రబాబునాయుడు కేసీఆర్ కు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా విజయరామారావుకు మంత్రి పదవి ఇచ్చాడు.ఆ సమయంలో కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చాడు. మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడంపై టీఆర్ఎస్ ఏర్పాటు చేశారని చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు అప్పట్లో విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలను కేసీఆర్ కొట్టిపారేశారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు వంటి నిర్ణయాలను కేసీఆర్ బహిరంగంగా విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కార్యాచరణకు గ్రౌండ్ వర్క్ సిద్దం చేసుకొన్నారు. అదే సమయంలో ఆనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూడ ఆయనకు కలిసొచ్చాయి.

దీంతో కేసీఆర్ 2001 ఏప్రిల్ 21వ తేదీన డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు. 2001 ఏప్రిల్ 27వ తేదీన జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీని ముందుకు నడిపాడు. ఈ క్రమంలో ఇతర పార్టీలతో కేసీఆర్ పొత్తులు పెట్టుకొన్నాడు. చివరకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించింది.

టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన 20 రోజులకే తెలంగాణ సింహాగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ పోరాటం ద్వారా తెలంగాణను సాధిస్తామని కేసీఆర్ ప్రకటించారు. హింసా పద్దతిలోనే తెలంగాణ కోసం ఉద్యమాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు ఉద్యమ కారులకు సూచించారు. ఆ దిశగానే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.

2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో కలిసి పోటీ చేసింది టీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఘోర ఓటమిపాలైంది. కరీంనగర్ నుండి కేసీఆర్, మెదక్ నుండి ఆలెనరేంద్ర ఎంపీగా విజయం సాధఇంచాడు. కేసీఆర్, నరేంద్రలు కేంద్రమంత్రులుగా యూపీఏ ప్రభుత్వంలో చేరారు.ఏపీ రాష్ట్రంలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హరీష్ రావు, నాయిని నర్సింహ్మరెడ్డిలు మంత్రులుగా పనిచేశారు.

2004 నుండి 2006 మధ్య కాలంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గ్యాప్ పెరిగింది. ఈ క్రమంలోనే కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. యూపీఏ నుండి వైదొలిగారు. ఎంపీ పదవికి కూడ ఆయన రాజీనామా చేశారు. ఈ సమయంలో కరీంనగర్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.ఈ సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ ను ఓడించేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు.

అప్పుడు కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి కేసీఆర్ పై పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో కేసీఆర్ రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత కూడ ఉద్యమ కార్యాచరణలో భాగంగా టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ రాజీనామా చేయించారు.దీంతో 2008 చివర్లో మరోసారి ఉప ఎన్నికలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో కేసీఆర్ 15 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొన్ని చోట్ల టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.

2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి విజయం సాధించింది. టీడీపీ ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైంది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంాన్ని కేసీఆర్ మరింత ఉధృతం చేశాడు.

2009 నవంబర్ 29న సిద్దిపేటలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరహారదీక్షకు సిద్దమయ్యాడు. కరీంనగర్ నుండి సిద్దిపేటకు వస్తున్న కేసీఆర్‌ను పోలీసులు అలుగునూరు వద్ద అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు.ఖమ్మం జైలులో కేసీఆర్ జైల్లోనే దీక్షను కొనసాగించాడు. ఆ తర్వాత ఆయనను ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో దీక్షను కొనసాగించాడు

2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటించారు. ఆ సమయంలో నిమ్స్‌లో కేసీఆర్ తో దీక్షను విరమించారు.తెలంగాణ ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో సమైక్య రాష్ట్ర ఉద్యమాలు సాగాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ నిలిచిపోయింది. కేసీఆర్ పట్టు వీడలేదు. కాంగ్రెస్ పార్టీ కూడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ సాధన ప్రక్రియను ప్రారంభించింది.

2014 పార్లమెంట్ చివరి సమావేశాల్లో తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే 2014లో ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీతో పొత్తు లేకుండానే టీఆర్ఎస్ పోటీ చేసి విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకు టీడీపీ 15 స్థానాలకు పరిమితమైంది.నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే అసెంబ్లీ ని రద్దు చేశాడు కేసీఆర్. 2018 డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చాడు. తొలిసారి కంటే ఎక్కువ స్థానాలతో రెండో సారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు.

loader