ఎవరి ఊహలు, ఆలోచనలు వాళ్లవే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీకి రాజీనామా చేయడంపై కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి స్పందించారు.  బీజేపీ పోటీలో లేదని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నడాన్ని ఆయన తప్పుబట్టారు.
 

Union Minister  Kishan Reddy Responds  On Komatireddy Rajagopal Reddy Resignation lns

హైదరాబాద్:ఎవరి ఊహలు వాళ్లవి, ఎవరి ఆలోచనలు వాళ్లవి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు.  ఎవరి ఇష్టం వాళ్లదేనన్నారు. దానికి మనమేం చేస్తామన్నారు.బీజేపీకి  మునుగోడు  మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంపై  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  స్పందించారు.

బుధవారంనాడు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ హైద్రాబాద్ లో  మీడియాతో మాట్లాడారు. బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయాన్ని మీడియా ప్రతినిధులు  కిషన్ రెడ్డి వద్ద ప్రస్తావించగా ఆయన స్పందించారు.   బీజేపీ పోటీలో లేదని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు.  ఈ విషయాన్ని ప్రజలు చెప్పాలన్నారు.  

గత కొంతకాలంగా బీజేపీ నాయకత్వం తీరుపై  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతుంది.  దీంతో  ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారని  చెబుతున్నారు.బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. ఈ నెల  27న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరనున్నారు.  ఇవాళ సాయంత్రం  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశం కానున్నారు.

2022 ఆగస్టు  మాసంలో  కాంగ్రెస్ కు , మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.  2022 అక్టోబర్ మాసంలో  జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి  ఓటమి పాలయ్యాడు.   

కేసీఆర్ ను గద్దె దింపాలనే లక్ష్యంతో  తాను  కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరినట్టుగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పట్లో ప్రకటించారు.  అయితే  ఏడాదిన్నర క్రితం ఉన్నపరిస్థితి రాష్ట్రంలో లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  బీఆర్ఎస్ కు  కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన రాజీనామా లేఖలో  ఈ అంశాలను రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు.

also read:ఆ విషయం నాకు తెలియదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయంపై వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించారు.  టిక్కెట్టు కేటాయింపుపై  కూడ రాజగోపాల్ రెడ్డికి  వేణుగోపాల్  హామీ ఇచ్చారని చెబుతున్నారు.  మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగనున్నారు.బీజేపీలోని అసంతృప్త నేతలు  కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. బీజేపీ నుండి వివేక్ వెంకటస్వామి కూడ కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారాన్ని వివేక్ వెంకటస్వామి కొట్టిపారేశారు.  తాను బీజేపీలో ఉంటానని చెప్పారు.  పెద్దపల్లి  ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తానని వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios