ఆ విషయం నాకు తెలియదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయంపై వెంకట్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు సమాచారం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. చేరికల విషయంలో అధిష్టానిదే తుది నిర్ణయమన్నారు.
 

Bhuvanagiri MP komatireddy Venkat Reddy Responds  On Komatireddy Rajagopal Reddy decision lns


హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్న విషయంలో తనకు  సమాచారం లేదని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.బుధవారంనాడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పార్టీలో చేరిక విషయాన్ని పార్టీ నాయకత్వం చూసుకుంటుందన్నారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడ కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని మీడియాలో కథనాలు తాను చూసినట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.ఎవరూ ఎక్కడ పోటీ చేయాలనే విషయమై  కాంగ్రెస్ నాయకత్వానిదే తుది నిర్ణయమన్నారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తుల విషయంపై ఇవాళ సాయంత్రానికి స్పష్టత వస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం తమకు  బలమైన స్థానంగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రేపు విడుదలయ్యే అవకాశం ఉందని వెంకట్ రెడ్డి చెప్పారు.  10-15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  గట్టి పోటీ ఉంటుందన్నారు.  

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని  తిప్పర్తి మండలానికి చెందిన  బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  ఇవాళ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో  కాంగ్రెస్ లో చేరారు.  తన వినతి మేరకు  కాంగ్రెస్ లో చేరినవారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

also read:బీఆర్ఎస్ కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం: బీజేపీకి కోమటిరెడ్డి రాజీనామా

2022 ఆగస్టు మాసంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.  బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.  దీంతో బీజేపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఇవాళ బీజేపీకి రాజీనామా చేశారు. ఎల్లుండి  కాంగ్రెస్ లో చేరనున్నారు.ఇవాళ సాయంత్రం తన అనుచరులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కానున్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో  కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  ఇప్పటికే  ఫోన్ లో చర్చలు జరిపారు.టిక్కెట్టు విషయమై  కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చినట్టుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో  మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. 2018 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆయన విజయం సాధించారు.  2022 ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు  వివేక్ వెంకటస్వామి కూడ  కాంగ్రెస్ లో చేరుతారని సమాచారం. కర్ణాటక డిప్యూటీ సీఎం  డీకే శివకుమార్ తో  వివేక్ వెంకటస్వామి చర్చలు జరిపారనే ప్రచారం కూడ లేకపోలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios